రహదారుల నిర్మాణాలకు నిధులివ్వండి


Wed,June 19, 2019 01:44 AM

చెన్నూర్, నమస్తే తెలంగాణ: చెన్నూర్ నియోజకవర్గం లో రహదారుల నిర్మాణానికి పెద్ద పీట వేయనుంది. నియోజకవర్గంలో పలు వాగులపై వంతెనలు, రహదారుల నిర్మాణానికి రూ. 143.40 కోట్ల మంజూరుకు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రతిపాదనలతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును హైదరాబాద్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. చెన్నూర్ మండలం లో సుద్దాల వాగు, అక్కెపల్లి వాగు, నారాయణపూర్ వాగు, మం దమర్రి మండలంలోని శంకర్‌పల్లి, అందుగులపేట, పులిమడుగు, కోటప ల్లి మండలంలోని లక్ష్మీపూర్ వద్ద హైలెవల్ వంతెనల నిర్మాణం కోసం రూ. 28,50 కోట్లు మంజూరు చేయాలని మంత్రిని ఆయన కోరారు. తారు రోడ్ల నిర్మాణంలో భాగంగా పొన్నారం - బీరెల్లి వాయా నాగాపూర్, సూల్తాన్‌పల్లి ఆర్‌ఆండ్‌బీ రోడ్డు -గంగారం, జిల్లా పరిషత్ రోడ్డు - దుబ్బపల్లి, చెన్నూర్ - పల్గుల, బబ్బెరచెలుక - కావర్‌కొత్తపల్లి వయా రాజా రాం, పీఆర్ రోడ్డు ఆరెపల్లి - లాల్‌బహుదూర్‌పేట వరకు దాదాపుగా 35 కొత్త రోడ్ల నిర్మాణానికి రూ. 70.90కోట్లు మంజూరు చేయాలని కోరారు.

నియోజకవర్గంలో రోడ్లు పునరుద్ధణలో భా గంగా 23 రోడ్లను తి రిగి కొత్తగా నిర్మిం చేందుకు రూ. 44 కోట్లు మంజూరు చే యాలని విజ్ఞప్తి చేశా రు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ మంత్రి దయాకర్‌రావు సానుకూలంగా స్పం దించారని తెలిపారు. ప్రభుత్వం నుంచి త్వరలో నిధులు మంజూరవుతాయని వెల్లడించారు. నిధులు విడుదల కాగానే వంతెనలు, రహదారుల నిర్మాణాలను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయనున్నట్టు తెలిపారు. రహదారు లు, వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మం జూరు చేయనుండడంతో నియోజకవర్గం లో మారు మూల గ్రామాలకు రావాణా సౌకర్యం మెరుగుకానుంది. రహదారులు, వంతెనల నిర్మాణానికి నిధుల మంజూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషి చేస్తుండటంతో నియోజకవర్గంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...