కొనసాగుతున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలన


Wed,June 19, 2019 01:44 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం తుది రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జిల్లా కేంద్రంలోని ఏఆర్ పరేడ్ మైదానంలో కొనసాగుతుంది. నాల్గో రోజూ మంగళవారం 550 మంది అభ్యర్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ విష్ణువారియర్ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలను పెట్టుకోవద్దని సూ చించారు. దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అలాంటి ఫేక్ కాల్స్ వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతిభ ఉన్న వారికి తప్పని సరిగా ఉద్యో గం వస్తుందన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్ష నుంచి మొదలుకొని ఈవెంట్స్ వరకు పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలను చేపట్టామన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదేశాల మేరకు ప్రక్రియ కొనసాగుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కంచ మోహన్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...