ఇంటికే ఈ-చలాన్‌


Tue,June 18, 2019 12:19 AM

-గతేడాది అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం
-ట్రిపుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, నో పార్కింగ్‌లపై నిఘా
-సిగ్నల్‌ వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా లో జనాభా క్రమంగా పెరుగుతోంది. రహదారుల విస్తీర్ణం మాత్రం పెరగడం లేదు. ప్రజలు ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో రహదారు లు సరిపోవడం లేదు. ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారు అధికమయ్యారు. ట్రాఫిక్‌ను నియంత్రించడం పోలీ సు శాఖకు కష్టతరంగా మారింది. వీటి ని అధిగమించడానికి జిల్లావ్యాప్తంగా అన్ని ఠాణా ల పరిధిలో గతేడాది అక్టోబర్‌ 16న ఈ-చలాన్‌ ద్వారా రుసుం విధించడం ప్రారంభించారు. అప్పటి నుంచి పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలు నిలుపక పోయిన, ర్యాష్‌గా వాహనాలు నడపినా, ట్రిపుల్‌ రైడింగ్‌, మైనర్లు డ్రైవింగ్‌ చేయడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపటం వంటివి చేసే వాహనదారులపై ఈ-చలాన్‌ రూపంలో కొరడా ఝళిపిస్తున్నా రు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆన్‌లైన్‌లో ఫొటోతోపాటు ఈ-చలాన్‌ ఇంటికే పంపుతున్నారు. ఫలితం గా వాహనాదారుల్లో జంకు మొదలైంది. మహానగరాలకు మాత్రమే పరిమితమైన ఈ విధానం జిల్లా లో అమలు చేయడంతో వాహనాల యజమానులు ధ్రువపత్రాలు వెంట తీసుకెళ్తున్నారు. డ్రైవింగ్‌ లైసె న్స్‌ లేని వారు ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిం చి ట్రాఫిక్‌ రూల్స్‌ ను పక్కాగా అమలు చేస్తున్న ఈ-చలాన్‌ సత్ఫలితాలను ఇస్తుందని ట్రాఫిక్‌ విభాగం పోలీసులు పేర్కొంటున్నారు.

ఇంటికే ఈ-చలాన్‌ జరిమానా
గతంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిచిన వాహనదారులను అక్కడే ఆపి చలాన్‌ విధించేవారు. చలానా కట్టలేని వారి వాహనాన్ని జప్తు చేసేవారు. ఈ ప్రక్రియతో కింది స్థాయి సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీస్‌శాఖ పాత విధానానికి స్వస్తి పలికింది. జిల్లాలో ఈ-చలాన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. జిల్లాలో అమలైన ఈ-చలాన్‌ జిల్లా కేంద్రంతోపాటు 16 మండలాల్లో అమలవుతోంది. నిబంధనలు పాటించని వారి వాహనాలను పోలీసులు ఫొటో తీసి ఈ-చలాన్‌ ద్వారా జరిమానా పత్రాన్ని ఆన్‌లైన్‌ ద్వారా వాహనదారుడి ఇంటికే పంపిస్తున్నారు. చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే అది కూడా నేరం కిందకే వస్తుంది. రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్లినా జరిమానా చెల్లించని విషయం బండి నంబర్‌తో సహా తెలిసిపోతుంది. అలాంటి వాహనాలను జప్తు చేసుకుని కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇన్నా ళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన పోలీసులు ఈ-చలాన్‌ విధానంతో నిబంధనలు కఠినతరం చేశారు. రాంగ్‌ పార్కింగ్‌, హెల్మెట్‌ లేకపోవడం, అతివేగం, రాంగ్‌ పార్కింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇతర పత్రాలు లేకపోవడం ఇలాంటి ఏ నిబంధనలు అతిక్రమించినా కష్టకాలమే. రోజు నిబంధనలు పాటించని వారి ఫొటో లు తీస్తూ ఇంటికే జరిమానాలు పంపిస్తున్నారు.

పైరవీలకు అవకాశం ఉండదు
గతంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను పట్టకున్న వెంటనే వదిలేయమం టూ పలువురు పైరవీలు చేస్తుంటారు. వదిలిపెట్టాలనో, తక్కువ పెనాల్టీ వేయాలనో కోరుతుంటారు. సార్‌ మా వాడే అని చివరకు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఫోన్లు వచ్చేవి. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు. ఈ-చలానా విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటికి చెల్లుచీటి పడింది. నిబంధనలు పా టించని వారి ఫొటో తీసి నేరుగా ఇంటికే జరిమానా పంపుతున్నారు. అతివేగం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, ట్రిపుల్‌ రైడింగ్‌ విషయంలో యువత ముం దు ఉంటున్నారు. 18ఏండ్ల నుంచి 30 వయసులోపు వారే ఇలాంటివి అధికంగా చేస్తున్నారు. ఇక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలో 28 నుంచి 45 ఏం డ్ల వయసు వారు అధికంగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. అందులోనూ నిరక్ష్యరాసులే అధికంగా ఉంటున్నారు. కూలీ, ఇతర పనులు ము గించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఎక్కువ మం ది మద్యాన్ని తీసుకుంటున్నారు. వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు.

ఈ-చలాన్‌ ద్వారా రూ.1.20 కోట్ల జరిమానా
జిల్లాలో అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌ వ్యవస్థ, నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపటం, ఇష్టం వచ్చిన చోట పార్కింగ్‌ చేయడం, మైనర్లు వాహనాలు నడుపుతుండబంతో అనేక ప్రమాదాలు జరగుతున్నాయి. ఎందరో అమాయక ప్రజ లు మృత్యువాత పడుతున్నారు. ఈ-చలాన్‌ విధానం అమలులోకి వచ్చాక నిబంధనలు కఠినతరం చేశారు. ఈ విధానం అమలు చేసిన ఎనిమిది నెలల్లో పెద్ద ఎత్తు న కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 37,194 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు, 321 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అదే విధంగా రూ.1.20 కోట్ల మేర జరిమానా విధించినట్లు వారు వెల్లడించారు. ఈ నూతన విధానంతో చాలా వరకు వాహనదారులు ధ్రువప్రతాలు తమ వెంట తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో హెల్మెట్‌ ధరించే వారి సంఖ్య కూడా పెరిగిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కాగా.. గతంలో ప్రజలు ట్రాఫిక్‌ నిబంధనలు విచ్చలవిడిగా ఉల్లంఘించేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందని మంచిర్యాల ట్రాఫిక్‌ సీఐ రమేశ్‌ బాబు తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...