సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్‌


Tue,June 18, 2019 12:18 AM

-ఎడ్యూకేషన్‌ జీఎం రాంనారాయణ
సీసీసీ నస్పూర్‌ : సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని సింగరేణి ఎడ్యూకేషన్‌ జీఎం రాంనారాయణ పేర్కొన్నారు. సీసీసీ నస్పూర్‌ సింగరేణి పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర టెక్నికల్‌ ఎడ్యూకేషన్‌ కమిషనర్‌ ప్రతినిధి రాజేశ్వర్‌రావు సమక్షంలో ఈ కౌన్సిలింగ్‌ ప్రక్రియ కొనసాగింది. అనంతరం ఎడ్యుకేషన్‌ జీఎం రాంనారాయణ, శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో చదువులు కొనసాగించాలన్నారు. పట్టుదల, క్రమశిక్షణ గల విద్యతో అనుకున్న ఫలితాలు సాధించడం పెద్ద కష్టమేమీకాదన్నారు. కొత్తగా పాలిటెక్నిక్‌ కళాశాలలో చేరుతున్న విద్యార్థులు చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. సింగరేణి యాజమాన్యం విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని ఆయన వివరించారు. కళాశాల ఆవరణలో జరిగిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచివిద్యార్ధులతో తమ తల్లిదండ్రులతో కౌన్సెలింగ్‌కు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌, డీజీఎం పర్సనల్‌ గోవిందరాజు, ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రావు, సింగరేణి పాలిటెక్నిక్‌ అడ్మిషన్‌ ఇన్‌చార్జి సుమన్‌, హెడ్‌ఓడీలు వెంకటేశ్వర్లు, దామోదర్‌, శ్రీనివాస్‌రెడ్డి, సాంబమూర్తి,, తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...