బలహీన వర్గాలకు వరం..


Tue,June 18, 2019 12:18 AM

-ఎమ్మెల్యే బాల్క సుమన్‌
-చెన్నూర్‌లో బాలుర గురుకుల పాఠశాల ప్రారంభం
చెన్నూర్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలలు బలహీన వర్గాల వారికి వరం లాంటివని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. చెన్నూర్‌లో మహాత్మ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు పది జిల్లాల్లో కలిపి 19మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవనీ, ఉండేవన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 143 ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం అదనంగా మరో 119 బీసీ గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. వీటిలో 92,300మంది బీసీ విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. బలహీన వర్గాల సంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు ఎంత శ్రద్ధ ఉందో దీనిని బట్టి అర్థమవుతోందన్నారు.

అన్ని వసతులతో నాణ్యమైన విద్యందిస్తుందని గురుకులాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను కోరారు. గురుకులల్లో చదివిన మారుమూల గ్రామాల విద్యార్థులు ఎవరెస్టు శిఖిరాలను ఎక్కుతూ రాష్ర్టానికి మంచి పేరు ప్రతిష్ఠలు తెస్తున్నారని హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల ప్రకటించిన ఎంసెట్‌ ఫలితాల్లో వందలాది మంది మంచి ర్యాంకులు సాధించారని, అలాగే మెడిసిన్‌ సీట్లు సొంతం చేసుకున్నారని వివరించారు. చెన్నూర్‌ నియోజకవర్గంలో 436మంది విద్యా సంస్థలు ఉన్నాయని, వీటిలోని ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని స్పష్టంచేశారు. కొత్తగా ఏర్పాటై గురుకులంలో అవుట్‌ సోర్స్‌ ఉద్యోగ అవకాశాలుంటే స్థానికులకు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తాను ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు గురుకులంలోనే చదివానని గుర్తుచేసుకున్నారు.

అదనపు తరగతి గదులకు భూమిపూజ
కస్తూర్బా పాఠశాలలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ నిధులతో రెండు తరగతి గదులను, ఒక ప్రయోగశాల గదిని పాఠశాలలో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ జాయింట్‌ కలెక్టర్‌ సురేందర్‌రావు, గురుకులాల జిల్లా కన్వీనర్‌ గౌతం కుమార్‌, జిల్లా బీసీ సంక్షేమాధికారి నజీం అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, స్త్రీ శిశు సంక్షేమ రీజినల్‌ ఆర్గనైజర్‌ అత్తి సరోజ, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి, జడ్పీటీసీ మోతె తిరుపతి, ఎంపీపీ మంత్రి బాపు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...