దవాఖానాల బంద్‌ సక్సెస్‌


Tue,June 18, 2019 12:18 AM

మంచిర్యాల అగ్రికల్చర్‌: జాతీయ మెడికల్‌ అసోసియేషన్‌ ఉత్తర్వులతో జిల్లాలో 24 గం టల (ఒక రోజు) బంద్‌ విజయవంతమైంది. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మంచిర్యాల పట్టణంతోపాటు జిల్లాలోని అన్ని ప్రయివేట్‌ దవాఖానాలు బంద్‌లో పాల్గొన్నా యి. వైద్యులు, దవాఖానాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా దేశ వ్యాప్త ఆసుపత్రుల బంద్‌లో భాగంగా జిల్లాలో బంద్‌ నిర్వహించి బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ పీ రమ ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కే ఫణి కుమార్‌ మాట్లాడుతూ కోల్‌కత్తాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కళాశాలలో జరిగిన సంఘటన మేరకు బంద్‌ పాటిస్తున్నామన్నారు. ఇలాంటివి ఇక నుంచి పునరావృతం కాకుండా ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. దీనిపై కేంద్రం స్పందించి ప్రత్యేక చట్టం తేవాలని కోరారు. బంద్‌ 18వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఉంటుందన్నారు. అన్ని సాధారణ వైద్య సేవలు నిలిపివేశామనీ, అత్యవసర సేవలు అందిస్తున్నామన్నారు. ఐఎంఐ వైద్యు లు మూర్తి, బీవీ రఘునందన్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...