ఎస్‌ఆర్‌పీ 3గనిపై


Tue,June 18, 2019 12:18 AM

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ గనులు, డిపార్ట్‌మెంట్లలో స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అధికారులు, టీబీజీకేఎస్‌ నాయకులు, కార్మికులు నిర్వహించారు. శ్రీరాంపూర్‌ ఎస్‌ఆర్‌పీ 3గనిపై మేనేజర్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో డీవైజీఎం విజయభాస్కర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, ఫిట్‌ కార్యదర్శి ఆర్‌ గోపాల్‌ కార్మికులు, అధికారులు గని ఆవరణలో చెత్తా చెదారం తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ నెల 21 వరకు సింగరేణిలో యాజమాన్యం స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్‌ సతీష్‌, డిప్యూటీ మేనేజర్‌ మహేందర్‌, వెంకటేశం, ప్రేమ్‌కుమార్‌, శంకరయ్య, నాయకులు భాస్కర్‌, వీరమల్లు, పులి రాజయ్య, సారయ్య పాల్గొన్నారు.
మందమర్రి రూరల్‌ : మందమర్రి ఏరియాలో స్వచ్ఛత పక్వాడా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఏరియాలోని అన్ని గనులు, డిపార్టుమెంటులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గని, డిపార్టుమెంట్లు పరిసర ప్రాం తాల్లోని చెత్తను, పనికి రాని వస్తువులను తీసి వేసి శుభ్రం చేశారు. గతేడాది తానే ఈ సంవత్సరం కూడా కార్మికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పని స్థలాలు పరిశుభ్రంగా ఉండడంతో కలిగే లాభాలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గనులు, డిపార్టుమెంట్ల అధికారులున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...