పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత


Tue,June 18, 2019 12:17 AM

-బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య
-అన్ని ఏరియాల్లో గనులు, డిపార్ట్‌మెంట్లపై స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం ప్రారంభం
రెబ్బెన : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య సూచించారు. బెల్లంపల్లి ఏరియాలో సోమవారం నుంచి స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏరియా లోని గనులు, డిపార్టుమెంట్లలోని పరిసరాలు పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం కొండయ్య మాట్లాడుతూ జాతిపిత మహాత్మగాంధీ కలలుగన్న స్వచ్ఛమైన భారత దేశంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఏరియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్ల, ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియాలోని వివిధ గనుల అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...