యోగాతో సంపూర్ణ ఆరోగ్యం


Tue,June 18, 2019 12:17 AM

- జీఎంలు లక్ష్మీనారాయణ,కొండయ్య, రాఘవులు
- గనులు, డిపార్ట్‌మెంట్లపై శిక్షణ తరగతులు ప్రారంభం
శ్రీరాంపూర్‌ : ప్రతిరోజూ యోగాసనాలు వేయడంతో దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండి, ఆరోగ్యంగా ఉంటారని శ్రీరాంపూర్‌ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్‌ ప్రగతి స్టేడియంలో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన యోగా కేంద్రాన్నిసోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం యోగా గురువు గోసిక మల్లేశం, చందర్‌ యోగా శిక్షణ ఇచ్చారు. జీఎం లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం యోగా అలవాటుగా చేసుకోవాలని, యోగాతో మనిషి దీర్ఘకాలిక జబ్బులు సోకకుండా ఉంటారని చెప్పారు. ఈ నెల 21న ప్రగతీ స్టేడియంలో 20 వేల మందితో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్‌, సీసీసీ ఏరియా కార్మికులు, కార్మిక కుటుంబాలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైజీఎం గోవిందరాజు, పీఎం తుకారాం పాల్గొన్నారు.

గనులు, డిపార్ట్‌మెంట్లపై..
శ్రీరాంపూర్‌ ఓసీపీపై ప్రాజెక్టు ఆఫీసర్‌ ఖవీంద్ర ఆద్వర్యంలో కార్మికులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్‌కే 6గనిపై ఇన్‌చార్జి మేనేజర్‌ శ్రీనివాస్‌రావు, డీవైజీఎం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో యోగా శిక్షకులు పోశెట్టి కార్మికులకు యోగాపై అవగాహన కల్పించి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్‌కే 7పై ఏజెంట్‌ రఘుకుమార్‌, మేనేజర్‌ గోసిక మల్లేశం, పిట్‌ కార్యదర్శి మెండ వెంకటి ఆధ్వర్యంలో కార్మికులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్‌కే 5, 5బీ గనులపై మేనేజర్‌ రామన్‌ వీ పాఠక్‌, పిట్‌ కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, సదయ్య, సత్యనారాయణ ఆధ్వర్యంలో యోగా గురువులు కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఎస్‌ఆర్‌పీ 3గనిపై మేనేజర్‌ రవికుమార్‌, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, ఏజెంటు విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో యోగా గురువు రవీందర్‌ కార్మికులకు యోగా తరగతులు ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్‌ ఆర్‌కే న్యూటెక్‌పై యోగాపై అవగాహన కల్పించారు. మేనేజర్‌ వెంగళరావు, సేఫ్టీ ఆఫీసర్‌ అజయ్‌కుమార్‌, సీనియర్‌ పీఓ దేవెందర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి డీ నర్సయ్య ఆధ్వర్యంలో కార్మికులకు యోగాసనాలు నేర్పించారు. ఈ కార్యక్రమాల్లో టీబీజీకేఎస్‌ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్న య్య, కేంద్ర చర్చల ప్రతినిదులు వీరబద్రయ్య, రీజియన్‌ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, చర్చల ప్రతినిధులు కుమారస్వామి, అశోక్‌, పోశెట్టి, రమేశ్‌, పెట్టం లక్షణ్‌, బ్రాంచి కార్యదర్శి పానగంటి సత్తయ్య, పిట్‌ కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, చిలుముల రాయమల్లు, పెండ్లి రవీందర్‌, కే సమ్మయ్య, పెంట శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, అధికారులున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...