సింగరేణి స్థలాల్లో ఇళ్లపై సర్వే ప్రారంభం


Tue,June 18, 2019 12:17 AM

- శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల్లో అర్హుల గుర్తింపు
-పట్టాలిచ్చేందుకు చర్యలు
శ్రీరాంపూర్‌ : తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం సింగరేణి స్థలంలో నివాసముంటున్న కార్మికులకు, కార్మికేతరుల కుటుంబాలకు పట్టాలు కల్పించడానికి ప్రభుత్వ రెవెన్యు సిబ్బంది సోమవారం సర్వే చేపట్టింది. మున్సిపల్‌ కమిషనర్‌, నస్పూర్‌ మండల తాసిల్దార్‌ మోబిన్‌ అమ్మద్‌, మున్సిపల్‌ మేనేజర్‌ సీపతి బాపురావు, రెవెన్యూ సిబ్బంది ఆర్‌ఐ మాదవి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌ తాళ్లపల్లి ఏరియా వాటర్‌ ట్యాంక్‌ ఏరియాలో ఇంటింటా సర్వే చేపట్టారు. సింగాపుర్‌ గ్రామ పరిధిలోని ఆర్‌కే 6గుడిసెల్లో మున్సిపల్‌ సిబ్బంది సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. జీఓ నంబర్‌ 58, 59 ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటా సర్వే చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న కార్మికులు, కార్మికేతర కుటుంబాలకు ప్రభుత్వం ఆదేశాల మేరకు పట్టాలు కల్పించే ప్రక్రియ మొదలయింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సింగరేణి స్థలాల నివాసులకు పట్టాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం శ్రీరాంపూర్‌ ఏరియాలో 176.18 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్‌మెంటుకు అప్పగిస్తామని తెలిపారు. దాంతో రెవెన్యు అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించి స్థలాల పరిధి రికార్డు చేశారని చెప్పారు. ఇందులో నమోదైన ప్రతి లబ్ధిదారుడూ తన పేరు, ఇంటి ఆవరణ స్థలం, ఆధార్‌ కార్డు, విద్యుత్‌ బిల్లులతో ఈ సేవలో నమోదు చేసుకోవాలని కోరారు. 125 గజాల ఇంటి స్థలానికి ఎలాంటి ప్రభుత్వ చెల్లింపులు ఉండవన్నారు. 125 గజాల కంటే ఎక్కువ స్థలంకు మార్కెట్‌ విలువ ఆధారంగా 25 శాతం చెల్లించాలన్నారు. పట్టాలు కల్పించడంలో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా ఉంటుందన్నారు. దళారులను నమ్మి మోస పోవద్దనీ, కోరారు. ఈ సర్వేలో మున్సిపల్‌ సిబ్బంది నారాయణ, పెద్దపల్లి గోపి పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...