గురుకులాల్లో ఉద్యోగాల పేరిట మోసం


Tue,June 18, 2019 12:16 AM

-132 మంది దగ్గర కోటికి పైగా వసూలు
-ఆరు జిల్లాల్లో బాధితులు
మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ : గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మబలికి మంచిర్యాల జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాలకు చెందిన నిరుద్యోగులతో పాటు చుట్టు పక్కల జిల్లాల వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేసి తీరా తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందనీ, డబ్బు లు ఇచ్చిన వారితో తనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటూ వారందరికీ కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపింది ఓ మహిళ. దాదాపు 132 మంది నిరుద్యోగుల నుంచి రూ. కోటి పైగా వసూ లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీ నోటీసులు అందుకున్న నిరుద్యోగులు లబోదిబోమం టూ సోమవారం మంచిర్యాల డీసీపీకి వినతిపత్రం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఠాకూర్‌ సుమలత కస్తూర్బా విద్యాలయంలో ఏఎస్‌ఓగా పనిచేస్తున్న ట్లు చెప్పుకునీ, తనకు పైఅధికారులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి ఉద్యోగాలు పెట్టిస్తానని ఒక్కొక్కరి దగ్గర రూ. లక్ష నుంచి రెండు లక్షల దాకా వసూలు చేసింది. ఇందుకు ఉద్యోగం రాకుంటే డబ్బు తిరిగి ఇస్తానంటూ నమ్మకం కలిగేలా ప్రాంసరీనోట్‌లు, ఖాళీ చెక్కులను అందించింది.

మరి కొందరికి స్టాం పు పేపర్లపై అప్పు తీసుకున్నట్లు రాసిచ్చింది. గతంలో కస్తూర్బా విద్యాలయంలో పనిచేయడంతో అంతా ఆమెను నమ్మి డబ్బులు అందించారు. ఆమెకు డబ్బులు ఇచ్చిన వారిలో మంచిర్యాల జిల్లాతో పాటు పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్‌, వరంగల్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెం దిన నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మి సుమలతకు డబ్బులు ఇచ్చామ నీ, గత కొన్నిరోజులుగా ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌గా ఉందనీ, ఆమె డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఫోన్‌కూడా స్విచాఫ్‌ చేశాడనీ, ఐపీ నోటీసులు అందాయని, తమకు న్యాం చేయాలని బాధితులు డీసీపీని కోరారు. మరోవైపు సుమలత ఇచ్చిన ఐపీ నోటీసులో తాను బట్టల వ్యాపారం చేసేదానిననీ, ఆ తర్వాత ,చిట్టీల వ్యాపారం కూడా చేశాననీ, కస్టమర్లు సరిగా డబ్బులు చెల్లించని కారణంగా అధిక వడ్డీలకు డబ్బు అప్పుగా తీసుకున్నాననీ, వారికి తిరిగి చెల్లించని కారణంగా అదేపనిగా ఒత్తిడి తెస్తున్నారనీ, ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, తనను కాపాడాలని ఆమె పేర్కొన్నారు.

విచారణ జరిపిస్తాం..
ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు సుమలత అనే మహిళపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెల్లంపల్లి వన్‌ టౌన్‌ సీఐకి ఆదేశాలు జారీ చేశాను. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారనే విషయం తెలియదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి.
- డీసీపీ రక్షిత కే మూర్తి

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...