ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి


Mon,June 17, 2019 01:30 AM

శంకరపట్నం: గ్రామ దేవతల కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో కలిసి మండలంలోని ఇప్పలపల్లెలో బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలకు, మెట్‌పల్లిలో రేణుకా ఎల్లమ్మ జాతరకు హాజరై అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. మొలంగూర్‌లో వావిలాల సత్యనారాయణ కూతురు వివాహం, రాజాపూర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్త గుంపుల నాగరాజు సోదరుడి కూతురు వివాహం జరుగగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇప్పలపల్లె, మెట్‌పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం రాజాపూర్‌లో ఎమ్మెల్యే గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. అలాగే ఆముదాలపల్లిలో ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొద్దుటూరి సంజీవరెడ్డి, ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు బైరి సంపత్, పిన్‌రెడ్డి వసంత, వంగల సరోజన, బత్తుల మానస, రంజిత్‌రావు, కొండ్ర రాజయ్య, దేవునూరి ఇసాక్, ఎంపీటీసీలు మాతంగి లక్ష్మి, వావిలాల రాజు, గుర్రం రామస్వామి, మాజీ సర్పంచులు మోత్కూరి సమ్మయ్య, గంట మహిపాల్, నాయకులు చౌడమల్ల వీరస్వామి, ఉమ్మెంతల సతీష్‌రెడ్డి, వంగల కిషన్‌రెడ్డి, పల్లె పాపిరెడ్డి, నర్సింహారెడ్డి, రమణారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ
శంకరపట్నం: మండలంలోని రాజాపూర్‌లో పిన్‌రెడ్డి సాయిరెడ్డి, తాడికల్‌లో నరహరి రజిత ఇటీవల మృతిచెందగా, బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు పిన్‌రెడ్డి వసంత, రంజిత్‌రావు, కొండ్ర రాజయ్య, దేవునూరి ఇసాక్, ఉప సర్పంచ్ కుర్రె ఓదెలు, మాజీ సర్పంచ్ గంట మహిపాల్, తాడికల్ సింగిల్ విండో చైర్మన్ పొలాడి హన్మంతరావు, వైస్ చైర్మన్ సాంబశివరెడ్డి, నాయకులు ఉమ్మెంతల సతీష్‌రెడ్డి, నర్సింహరెడ్డి, కీసర సంపత్, మాతంగి లక్ష్మయ్య, కోడూరి వీరస్వామి, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...