ఫసల్‌ బీ(ధీ)మా


Sun,June 16, 2019 02:31 AM

మంచిర్యాల అగ్రికల్చర్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలకు సంబంధించి ప్రీమియం చెల్లింపు తేదీలు ఖరారయ్యాయి. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనలో వరి, కంది పంటలకు బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభు త్వం కల్పిస్తుండగా, మిరపకు రాష్ట్ర ప్రభుత్వం బీమా చేస్తోంది. ఈ రెండు పథకాల అమలులో రైతు చెల్లించే ప్రీమియం వాటా కాకుండా మిగిలినది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత ఇన్సూరెన్సు కంపెనీకి చెల్లించనున్నాయి.
అండగా నిలుస్తున్న పథకాలు
ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకం అన్నదాతకు అండగా నిలుస్తోంది. వాతావరణంలో మార్పులు, కరువు, వరదలు, తుఫాను, చీడపీడ లు, తెగుళ్లు, అల్ప- అధిక వర్షపాతం భారీ నుంచి కాపాడేందుకు, ఆర్థికంగా రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును గతంతో పోల్చితే ఒక నెల ముందుగానే ప్రకటించారు. దీనితో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా
వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, పసుపు పంటలు వేసే రైతులు ఈ పథకంలో చేరవచ్చు. వరిని గ్రామం యూనిట్‌గా తీసుకోగా, మండలం యూనిట్‌గా మిగిలిన పంటలన్నింటికీ వర్తింపజేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాల పొందని రైతులు ప్రీమియం చెల్లించి, దరఖాస్తు ఫారంను సమీప బ్యాంకులో అందజేయాలి. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకం దరఖాస్తుకు ప్రీమియం చెల్లింపుల గడువు వరి, మిరప పంటలకు ఆగస్టు 31. పత్తి పంటకు జూలై 15 మిగిలిన పంటల ప్రీమియం చెల్లింపులకు గడువును జూలై 31గా నిర్ధేశించారు.

వాతావరణ ఆధారిత పంటల బీమా
వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పు డు, వాతావరణంలోని మార్పుల వల్ల పంటలకు కలిగే నష్టాలకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకానికి కౌలు రైతులు సైతం అర్హులే. పత్తి, మిర్చి పంటల కు నష్టం సంభవించినప్పుడు మండలాన్ని యూనిట్‌గా బాధిత రైతులకు బీమా అందిస్తారు. ఈ ప్రీమియం సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన భాగస్వామ్యంలో చెల్లిస్తాయి.
బీమాతో ప్రయోజనాలు
పంట వేసినప్పటి నుంచి కోత వరకు అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగండ్లు, తుఫానుతో పంట మునుగుట, తెగుళ్లు, ప్రతికూల వాతావరణం, తదితర వాటితో దిగుబడి నష్టాలను పంట కోత ఫలితాల ఆధారంగా నష్ట పరిహారం చెల్లింపు జరుగుతుంది.
డుపతి కూల వాతావరణం కారణంగా రైతులు పంట విత్తలేక పోవడం, నాట్లు వేయకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు బీమా మొత్తంలో 25 శాతం వరకు సత్వర పరిహారం చెల్లిస్తారు.
పొలాలు నీటి మునగడం , వడగండ్ల వాన, మట్టి పెల్లలు విరిగిపడటం లాంటి విపత్తుల వల్ల జరిగే నష్టాలకు పరిహారం చెల్లిస్తారు.
పంట సాగులో మధ్య కాలంలో నష్టపోయి న పంటను అంచనా వేసి పరిహారం 25 శాతం రైతులకు ముందస్తుగా అందిస్తారు.
కోత తరువాత పొలంలో ఆరబెట్టిన పంటలకు 14 రోజుల వరకు తుపాను, అకాల వర్షాల వల్ల పంట నష్టంవాటిల్లినప్పుడు రైతువారీగా పరిహారం అందిస్తారు.

అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధం..
జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఫసల్‌ బీమా పథకం, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలపై అవగాహన కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో మండలాల్లోని ఆయా గ్రామాల్లో ప్రచార రథాల ద్వారా తిరుగుతూ ప్రజలకు బీమా పథకాల వల్ల కలిగే ఉపయోగాలను వివరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తక్కువ ప్రీమియంతోనే పంట నష్టం జరిగినప్పుడు ఏ విధంగా లబ్ధిపొందవచ్చునో వివరించనున్నారు. ఏయే పంటలకు ఎంత రైతు చెల్లించాలి, ప్రభుత్వం ఎంత భరిస్తుం ది, నష్టం వాటిల్లినప్పుడే ఎంత డబ్బు పరిహారం గా వస్తుందో అవగాహన కల్పించనున్నారు.
గడువులోగా చెల్లిస్తేనే వర్తింపు...
ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనతోపాటు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లించే రైతులు గడువులోగా చెల్లిస్తేనే వర్తిస్తుంది. ఇఫ్కో టోకియో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ అనే కంపెనీ ఈ రెండు పథకాల కింద బీమా ప్రీమియాన్ని స్వీకరిస్తున్నాయి. రుణా లు తీసుకున్న రైతుల ప్రీమియం నేరుగా బ్యాంకు నుంచే కట్‌ అవుతుండగా రుణాలు తీసుకోని రైతులు స్థానిక వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి వారి దగ్గర ఉన్న దరఖాస్తు ఫారాన్ని నింపి సూచించిన ప్రీమియం మొత్తాన్ని ఏదేని వాణిజ్య లేదా జిల్లా కేంద్ర సహకార లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌సీ) లేదా ఇఫ్కో టోకియో ఆన్‌లైన్‌ ద్వారా www.pmfby.gov.in చెల్లిస్తూ ఈ పథకంలో చేరవచ్చు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...