పలువురు సీఐల బదిలీలు


Sun,June 16, 2019 02:29 AM

మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ: పోలీస్‌ శాఖలోని నార్త్‌జోన్‌ (వరంగల్‌ రీజియన్‌) పరిధిలో పనిచేస్తున్న పలువురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉంటూ నార్త్‌జోన్‌ కంట్రోల్‌రూంకు అటాచ్డ్‌గా ఉన్న కె నరేష్‌కుమార్‌ను ఉట్నూర్‌ ఇన్‌స్పెక్టర్‌గా , ఉట్నూరులో పనిచేస్తున్న కె వినోద్‌ను కరీంనగర్‌ డీఐజీకి అటాచ్డ్‌గా, ఖానాపూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆకుల అశోక్‌ను రెబ్బెన ఇన్‌స్పెక్టర్‌గా, రెబ్బెనలో పనిచేస్తున్న వీవీ రమణమూర్తిని కరీంనగర్‌ డీఐజీకి అటాచ్డ్‌గా, గోదావరిఖని వన్‌టౌన్‌ రెండో ఇన్‌స్పెక్టర్‌ ముస్క రాజును ఆసిఫాబాద్‌ ఎస్‌హెచ్‌ఓగా, ఆసిఫాబాద్‌లో పనిచేస్తున్న పైండ్ల మల్లయ్యను కరీంనగర్‌ డీఐజీకి అటాచ్డ్‌గా, రామగుండం ఐటీ విభాగంలో పనిచేస్తున్న సీహెచ్‌ రాణాప్రతాప్‌ను వాంకిడి ( ఆసిఫాబాద్‌ రూరల్‌ సర్కిల్‌)కి, వాంకిడిలో పనిచేస్తున్న వీ వేణుగోపాల్‌రావును కరీంనగర్‌ డీఐజీకి అటాచ్డ్‌గా, మంచిర్యాల ఎస్‌హెచ్‌ఓ ఎడ్ల మహేష్‌ను మందమర్రి ఇన్‌స్పెక్టర్‌గా, మందమర్రిలో పనిచేస్తున్న కే రాంచందర్‌రావును కరీంనగర్‌ డీఐజీకి అటాచ్డ్‌గా, బోథ్‌ సర్కిల్‌లో పనిచేస్తున్న జి జయరాంను ఖానాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌గా, మంచిర్యాల సైబర్‌క్రైంలో పనిచేస్తున్న ఎస్‌ వాసుదేవరావును భూపాలపల్లి ఎస్‌హెచ్‌ఓగా, మంచిర్యాల ట్రాఫిక్‌ సీఐగా పనిచేస్తున్న జీ రమేష్‌ను గోదావరి ఖని వన్‌టౌన్‌కు, శ్రీరాంపూర్‌లో పనిచేస్తున్న బీ నారాయణను లక్షెటిపేట సర్కిల్‌కు, లక్షెటిపేటలో పనిచేస్తున్న నాగపురి శ్రీనివాస్‌ను కరీంనగర్‌ డీఐజీ అటాచ్డ్‌గా, గోదావరిఖని ట్రాఫిక్‌లో పనిచేస్తున్న బిల్ల కోటేశ్వర్‌ను శ్రీరాంపూర్‌ ఇన్‌స్పెక్టర్‌గా, ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న బీ తిరుపతిరెడ్డిని మంచిర్యాల సీఐగా బదిలీ చేశారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...