లోక్‌ అదాలత్‌కు సహకరించాలి


Sun,June 16, 2019 02:28 AM

-న్యాయవాదులు, పోలీసుల సమీక్షా సమావేశంలో న్యాయమూర్తి శ్రీలేఖ
మంచిర్యాల లీగల్‌: జూలై 13వ తేదీ నిర్వహిం చే జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కార లక్ష్య సాధనకు న్యాయవాదులు సహకరించాలని మంచిర్యాల సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ కోరారు. సీనియర్‌ సివిల్‌ కోర్టు హాల్‌లో శనివారం ఏర్పా టు చేసిన లోక్‌ అదాలత్‌ సమీక్షా సమావేశంలో ఆమె న్యాయవాదులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసే లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయాలని కోరారు. లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలని న్యాయవాదులకు సూచించారు. బార్‌ అధ్యక్షుడు కొత్త సత్తయ్య స్పందిస్తూ ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. న్యాయ మూర్తులు రమేశ్‌, తిరుపతి, బార్‌ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, ఉపాధ్యక్షుడు ఆర్‌ఆర్‌ రాము లు, జాయింట్‌ సెక్రటరీ మురళీకృష్ణ, అడిషనల్‌ పీపీ నోముల రాజ్‌కుమార్‌, కోశాధికారి గంగ య్య, న్యాయవాదులు రంగు మల్లేశ్‌, స్వామి, అశోక్‌, తాజ్‌, రాజారమేశ్‌, మల్లిఖార్జున్‌ రెడ్డి తో పాటు పలువురు న్యాయవాదులు, మండల లీగ ల్‌ సెల్‌ సభ్యులు శ్రీలత, సుదీష్ణ, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు కృషి చేయాలి
జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో కేసుల లక్ష్యా న్ని చేదించేందుకు పోలీస్‌ అధికారుల పరస్పర స హకారం అందించాలని జడ్జిలు శ్రీలేఖ, బీ రమేశ్‌, ఉప్పులేటి తిరుపతి సూచించారు. సీనియర్‌ సివిల్‌ కోర్టు హాల్‌లో లోక్‌ అదాలత్‌ విజయవంతం కో సం పోలీస్‌ అధికారులతో సమీక్ష సమావేశం ఏ ర్పాటు చేశారు. ఎక్కువ కేసులు పరిష్కారమ య్యే లా పోలీస్‌ అధికారులు శ్రమించాలనీ, గతంలో జరిగిన లోక్‌ అదాలత్‌ మాదిరిగానే పోలీస్‌ అధికారుల సహకారం ఉండాలని కోరారు. అడిషనల్‌ పీపీ నోముల రాజ్‌ కుమా ర్‌, మంచిర్యాల డిప్యూ టీ పోలీస్‌ కమిషనర్‌ రక్షిత కే మూర్తి, అసిస్టెంట్‌ పోలీస్‌ క మిషనర్‌ గౌస్‌బాబాతో పాటు తూర్పు జిల్లాలోని సీఐలు ఎడ్ల మ హేశ్‌, కృష్ణకుమా ర్‌, ఎస్‌ఐలు ఓంకార్‌ యాదవ్‌, రవిప్రసాద్‌, శివ కుమార్‌, శ్రీకాంత్‌, మారుతి, ప్రమోద్‌ రెడ్డి, ఎక్సైజ్‌ ఎస్‌ఐలు వసంత రావు, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...