ఎస్సీ హాస్టళ్లలో సకల సౌకర్యాలు


Sun,June 16, 2019 02:28 AM

-డీడీ రవీందర్‌ రెడ్డి
మంచిర్యాల స్పోర్ట్స్‌ : ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోందని, జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో శనివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఎస్సీ వసతి గృహాల్లో ప్రవే శాల ప్రక్రియ, కల్పిస్తున్న సౌకర్యాలను వివరిం చారు. జిల్లాలో 24 ఎస్సీ వసతి గృహాలు ఉన్నా యన్నారు. ఇందులో చింతగూడ, తపాలాపూర్‌, దండేపల్లి, లక్షెట్టిపేట, దొనబండ, మందమర్రి, తాండూర్‌,పొన్నారం,జైపూర్‌,భీమారం,చెన్నూ ర్‌, కోటపల్లి,బెల్లంపల్లి,నెన్నెల బాలుర స్కూల్‌ ఉన్నాయని వివరించారు. బాలికల స్కూల్‌ హాస్ట ళ్లు లక్షెట్టిపేట, చెన్నూర్‌, బెల్లంపల్లిలో ఉన్నాయి. ఇందులో 3నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తు న్నట్లు తెలిపారు. కళాశాల స్థాయిలో బాల బాలికలకు హాస్టళ్లు మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లిలో ఉన్నాయని బాలికల కళాశాల హాస్ట ళ్లు మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, లక్షెట్టిపేటలలో ఉన్నాయని పేర్కొన్నారు.వాటిలో ఇంటర్‌ నుంచి పీజీ వరకు అడ్మిషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు రెండు పాస్‌పొర్ట్‌ సైజ్‌ ఫొటోలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డ్‌, బోనోఫైడ్‌ సర్టిఫికెట్లు, టీసీ జిరాక్స్‌ ,తెల్ల రేషన్‌ కార్డ్‌, ఆరోగ్యశ్రీ కార్డు దరఖాస్తు ఫారానికి జతచేసి, చేరాలనుకునే హాస్టల్‌లో వార్డెన్‌కు అందించాలని సూచించారు.

కల్పిస్తున్న సౌకర్యాలు
విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో విశాలమైన గదులు, స్కూల్‌ హాస్టల్‌ విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ఉచితంగా నోట్‌బుక్స్‌, స్కూల్‌ బ్యాగులు, 4 జతల యూనిఫామ్స్‌, రెండు జతల షూస్‌, బెడ్‌షీట్‌, రగ్గులు, స్వెట్టర్లు, మంకీ క్యాప్‌, ప్రతి విద్యార్థికి బెడ్‌, పరుపు, దిండు,ఎస్సెస్సీ విద్యార్థులకు ట్యూటర్స్‌చే ప్రత్యేక భోధన తరగతులు నిర్వహణ, రాత్రివేళ స్టడీ అవర్స్‌లో టీ,స్నాక్స్‌, మినరల్‌ వాటర్‌, స్నానానికి వేడినీళ్ల సౌకర్యం,ప్రతి అదివారం మధ్యాహ్నం చికెన్‌ రైస్‌ భోజనం, ప్రతి విద్యార్థికి కాస్మోటిక్‌(బాలురకు)చార్జి రూ. 62, బాలికలకు రూ. 75 ప్రతినెల అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు క్రీడా సామగ్రి, ప్రతినెల మెడికల్‌ చెకప్‌లు, ఎస్సీ హాస్టల్స్‌లలో ఉన్న విద్యార్థులకు ఇంటర్‌లో కార్పొరేట్‌ కాలేజీలో సీటు మార్కుల మెరిట్‌ను ప్రకారం కేటాయించనున్నట్లు వెల్లడించారు. కళాశాల హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నామని తెలిపారు. నెలలో నాలుగు వారాలు చికెన్‌, రెండు వారాలు మటన్‌తో భోజనం,వారంలో వివిద రకాల టిఫిన్స్‌, ఉదయం పాలు, సాయం త్రం టీ, స్నాక్స్‌ అందిస్తున్నామని తెలిపారు. వివరాలకు 9441874738,9441333348లలో సంప్రదించవచ్చునని రవీందర్‌రెడ్డి తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...