రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం


Sun,June 16, 2019 02:27 AM

-కేవీకే ప్రోగ్రాం కోఆర్టినేటర్‌ శాస్త్రవేత్త రాజేశ్‌నాయక్‌
-ఖరీఫ్‌ సాగుపై రైతులకు అవగాహన
బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ: కరీఫ్‌ పంటల సాగుపై కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మాల గురిజాల రైతులకు శనివారం అవగాహన కల్పిం చారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్టినేటర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం రాజేశ్‌నాయక్‌ మాట్లాడుతూ సాగుపై అవగాహన కల్పించి ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. కరీఫ్‌ సాగుపై నైపుణ్యతను రైతుల్లో పెంచుతున్నామన్నారు. రైతు లు కరీఫ్‌ సాగుకు సిద్ధం కావాలని కోరారు. ప్ర స్తుతం జిల్లాలో 15.4 ఎంఎం వర్షపాతం నమోదైందనీ, అది సాధారణకంటే 76 శాతం తక్కువ గా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరిసాగు చేసే రైతులు మధ్యకాలిక 135 స్వల్పకాలిక (115- 120రోజులు)రకాలను మాత్రమే సాగుచేయాలని కోరారు. దీని వల్ల పచ్చిరొట్ల ఎరువులవాడకం తగ్గిడమేకాక పెట్టుబడి అదుపులో ఉం టుందన్నారు. భూములు చౌడుపడకుండా కాపాడుకునే వీలుంటుందని తెలిపారు. తేలిక నేలల్లో పత్తి సాగు చేసే రైతులు మొక్కల మధ్య దూరం తగ్గించి సాంద్రతను పెంచడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చునని చెప్పారు. 65 ఎంఎం వర్ష పాతం తర్వాత మాత్రమే రైతులు విత్తుకోవాలని సూచించారు. విత్తనం మొలకెత్తాక మళ్లీ విత్తుకోవాలని వివరించారు. ఈ సదస్సులో కేవీకే శాస్త్రవేతల బృందం, రైతులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...