నేత్రపర్వం


Fri,June 14, 2019 02:36 AM


-మెట్‌పల్లిలో వైభవంగా వేంకటేశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠాపన
-కనులపండువలా స్వామివారి కల్యాణం
-గోవిందనామ స్మరణతో మార్మోగిన ఆలయం
-చిన జీయర్ స్వామి సమక్షంలో ప్రత్యేక పూజలు
-పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దంపతులు
మారుతీనగర్ : మెట్‌పల్లి పట్టణంలోని ఖాదీ ఆవరణలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు గురువారం నేత్రపర్వంగా జరిగాయి. త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఆరాధన, బాలభోగ నివేదన, శాంతి హోమం, వేదపారాయణం, చతుస్థ్సానార్చన, మహా పూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్ట, తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సతీమ ణి సరోజన దంపతులు, ఆలయ ధర్మకర్త దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మూల విరాట్‌కు జీ యర్‌స్వామి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు అంగరంగ వైభవంగా కల్యాణాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల గోవిందనామస్మరణలతో ఆల యం మార్మోగింది, ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కు అన్నదానం ఏర్పాటు చేశారు. వికాస తరంగణి భక్తులు, ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...