పేదల పాలిట వరం సీఎంఆర్‌ఎఫ్


Fri,June 14, 2019 02:26 AM

ధర్మపురి,నమస్తేతెలంగాణ: ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజల పాలిట వరంలా మారిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని ఆయన కార్యాలయంలో గురువారం ధర్మపురి మండలం తుమ్మెనాలకు చెందిన ఎం.సత్తయ్యకు రూ.2.40లక్షల విలువగల చెక్కును అందజేశారు. సత్తయ్య కుమారుడు వెంకటేశ్ అనారోగ్యంతో బాధపడుతుండగా.. సహాయార్థం మంత్రి ఈశ్వర్‌ను ఆశ్రయించారు. స్పందించిన మంత్రి ఈశ్వర్ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిన ప్రతిపాదనల మేరకు రూ.2.40 వేలక్షలు మంజూరు కాగా, చెక్కును బాధిత కుటుంబానికి మంత్రి అందజేశారు. సత్తయ్య కుటుంబసభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...