పెండింగ్ కేసులను త్వరగా ఛేదించాలి


Fri,June 14, 2019 02:24 AM

జగిత్యాల క్రైం : చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సింధూశర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేం ద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయలో జిల్లా ఎస్పీ సింధూ శర్మ గురువారం నెల వారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మే నెలలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసులపై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా పెండింగ్ కేసులు వివరాలను సైతం పో లీస్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్ వేసిన తర్వాత చేసే నేరపరిశోధన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన చేతిరాతతో పార్ట్-2లో వివరాలు పొందుపర్చాలన్నా రు. నేరం జరిగిన తర్వాత త్వరగా కేసుల విచారణ చేసి నేరస్థులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా చూడాలన్నారు. నేరాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా అమర్చిన సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అవసరమున్న పరిసరాలల్లో కెమెరాలు అమర్చాలన్నారు. క్రైం కంట్రోల్ అండ్ ట్రాకింగ్ నెట్‌వర్కింగ్ సిస్టం (సీసీటీఎన్‌ఎస్) గురించి ప్రతి పోలీస్ అధికారి, పోలీసులకు అవగాహన ఉండాలన్నారు. కేసులకు సంబందించి ఆ న్‌లైన్ నమోదులో పెండింగ్ ఉంచరాదన్నారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో మెట్‌పెల్లి డీఎ స్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ ప్రతాప్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రాజు, సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్ సిబ్బంది, డీసీఆర్‌బీ సిబ్బంది పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...