పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి


Thu,June 13, 2019 02:12 AM

-డీపీఓ వీరబుచ్చయ్య
- కన్నెపల్లి నర్సరీ పరిశీలన
దండేపల్లి : మండలంలో నిర్దేశించిన మేరకు అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరితహారం లక్ష్యాన్ని అధిగమించాలని డీపీఓ వీరబుచ్చయ్య పేర్కొన్నారు. దండేపల్లి మండలం కన్నెపల్లిలో ఈజీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన నర్సరీని బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నర్సరీలో మొక్కల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. రైతులకు కావాల్సిన మొక్కలను వారికి అందించాలనీ, ఏయే మొక్కలు రైతులకు కావాలో అడిగి తెలుసుకోవాలన్నారు. గ్రామంలో ఖాళీ ఉన్న ప్రదేశాల్లో నాటాల్సిన మొక్కలు, పంపిణీ చేయాల్సిన వాటిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నాటిన ప్రతి మొక్కను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హరితహారం కార్యక్రమంలో సర్పం చ్, పంచాయతీ కార్యదర్శులను భాగస్వాములను చేయాలనీ, ప్రతి గ్రామంలో ప్రజలకు కార్యక్రమ ప్రాధాన్యత వివరించాలన్నారు.ప్రజలు పూర్తి స్థాయి లో భాగస్వాములైతేనే కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. వర్షం పడిన వెంటనే హరితహారం కార్యక్రమం ప్రారంభానికి అన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. డీపీఓ వెంట ఎంపీడీఓ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ గడికొప్పుల రజనీ, పంచాయతీ కార్యదర్శులు చంద్రమౌళి, సనంద, ఈజీఎస్ ఈసీ శ్రీనివాస్, టీఏ జగన్, ఎఫ్‌ఏ మురళి, టీఆర్‌ఎస్ నాయకులు గడికొప్పుల సురేందర్ ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...