పల్లెల్లో మెరుగైన సేవలు


Thu,June 13, 2019 02:12 AM

-ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షాహిద్
కోటపల్లి: 108, 102, 1962 ద్వారా గ్రామీ ణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షాహిద్ అన్నారు. మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. 108 వాహన పరిస్థితి, ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తె లుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒ క్కరికీ నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందిచాల నే లక్ష్యంతో జీవికే ఈఎంఆర్‌ఐ సంస్థ ఆద్వర్యం లో 108, 102 వాహనాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గర్భిణులకు ప్రసవ సేవలతో పాటు ఆపత్కాలంలో 108 వాహనాలు ఉత్తమ సేవలు అం దిస్తున్నాయనీ, 108 సిబ్బంది రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటలు పనిచేస్తూ మంచిపేరును తీసుకువస్తున్నారని చెప్పారు. 102 అమ్మ ఒడి అంబులెన్స్ గర్భిణులకు వరంలాంటిందనీ, ప్రభు త్వ దవాఖానలో వైద్య సేవల కోసం 102 వాహనాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అనంతరం తల్లిబిడ్డలను సురక్షితంగా ఇంటివద్ద దించ్చేందుకు 102 అంబులెన్స్ పనిచేస్తున్నాయన్నారు. 1962 పశు ఆరోగ్య సంచార వాహనాల ద్వారా మూగ జీవాలకు సేవలు అందిస్తున్నట్లు వివరించారు. శిక్షణ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ విజయ్ కుమార్, 108 ఈఎంటీ సౌడం తిరుపతి, ఫైలెట్ ఫరీద్ అహ్మద్ ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...