స్పీడ్ గవర్నర్ లేకుంటే సీజ్


Thu,June 13, 2019 02:12 AM

మంచిర్యాల స్పోర్ట్స్: స్పీడ్ గవర్నర్ లేని ట్రా న్స్‌పొర్ట్ వాహనాలను ఆగస్ట్ 1వ తేదీ నుంచి సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య తెలిపారు. వేంపల్లిలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఎంవీఐ వివేకానందరెడ్డితో కలిసి మాట్లాడారు. స్పీడ్ గవర్నర్‌కు సంబందించి కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిపికేషన్‌ను విడుదల చేసిందని తెలిపారు. 1 అక్టోబర్, 2015 గానీ, ఆ తరువాత గానీ తయారైన విద్యా సంస్థల, సరుకు, ప్రజా రవాణా వాహనాలన్నింటికీ వాహనం తయారు చేసే కంపెనీ లేదా డీలర్ వద్ద గాని స్పీడ్ గవర్నర్ డీవైస్ జులై 31వ తేదీలోగా తప్పనిసరిగా బిగించాలని ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

ఇం దులో నుంచి బైక్‌లు, ఆటోలకి, చిన్న సరుకు వాహనాలకు, ప్రయివేట్ కార్లకు మినహాయింపు ఉన్నదని తెలిపారు.ఫిట్‌నెస్ లేని విద్యా సంస్థల బస్సులపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని డీటీవో కిష్ట య్య, ఎంవీఐ వివేకానందరెడ్డి తెలిపారు. జిల్లాలో విద్యాసంస్థల బస్సులు 287 ఉన్నాయని ఇందు లో ఇప్పటికే 212 బస్సులు ఫిట్‌నెస్ పూర్తి చేసుకున్నాయని మిగతా బస్సుల యాజమాన్యాలు కుడా ఫిట్‌నెస్ చేయించుకోవాలని గురువారం నుంచి విద్యాసంస్థల బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపడుతామని తనిఖీలలో పట్టుబడితే బస్సులను సీజ్ చేసి రికగ్నేషన్ రద్దుకు సిపారసు చేస్తామని అన్నారు. హరితాహారంలో భాగంగా జిల్లాలో రవాణాశాఖ నుంచి ఐదువేల మొక్కలను నాటి సంరక్షించనున్నామని తెలిపారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...