పాత వీవీలకే బాధ్యతలు


Thu,June 13, 2019 02:11 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల లేని చోట అవసరం ఉన్నచోట ప్రతి సంవత్సరం విద్యాశాఖ విద్యావలంటీర్లను నియమిస్తున్నది. దీని కోసం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చి నిబంధనలు అనుసరించి విద్యావలంటీర్లను నియమిస్తారు. ఈ విద్యాసంవత్సరం జూన్ 12వ తేదీనుంచి విద్యావలంటీర్లను రీఎంగేజ్ చేయాలని విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇబ్బందులు కులుగకుండా తరగతులు రెగ్యూలర్ జరిగే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే కాలయాపన లేకుండా 2018-19 సంవత్సరంలో పనిచేసిన విద్యావలంటీర్లను అధికారులు వీవీలను రీఎంగేజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో లోకల్‌బాడిస్, ప్రభుత్వ పాఠశాలలు 710 ఉండగా 42,483 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతేడాది 279 మంది విద్యావలంటీర్లు జిల్లాలో పనిచేశారు. ఉన్నత అధికారుల అదేశాల ప్రకారం గతేడాది ఉన్న వారినే ప్రస్తుతానికి రీఎంగేజ్ చేస్తున్నామని డీఈఓ ఎంఏ రషీద్ తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో ఎక్కడ కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా వీవీలను ఏర్పాటు చేస్తున్నామని ఏదైన అవసరం అనుకుంటే ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...