బొలేరో బోల్తా : ఒకరి మృతి


Thu,June 13, 2019 02:11 AM

-ఎనిమిది మంది విద్యుత్ కూలీలకు తీవ్ర గాయాలు
చెన్నూర్ రూరల్ : చెన్నూర్ మండలంలోని అంగ్రాజ్‌పల్లి గ్రామ సమీపంలో విద్యుత్ కూలీలతో వస్తున్న బొలోరా ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది విద్యుత్ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని నాగాపూర్ గ్రామంలో విదుత్ తీగలు అమర్చి వస్తుండగా అంగ్రాజ్‌పల్లి వద్ద బోలేరో టైర్ పగిలడంతో బోల్తా పడింది. బొలేరోలో ఉన్న విద్యు త్ కూలీలు బత్తిని సీతారం, దూపం భానయ్య, వై లింగయ్య, రామటెంకి మహేందర్, చింతం శ్రావణ్, పడాయి రవి, కావడి రాము, మద్దూరి శ్రీను, రంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన లో చికిత్స పొందుతూ చెన్నూర్ మండలంలోని చింతపల్లి గ్రామానికి చెంది న రామటెంకి మహేందర్(27) మృతి చెందాడు. గాయపడ్డ బెజ్జూర్‌తో పాటు పలుగ్రామాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా విద్యుత్ కాంట్రాక్టర్ నాగస్వామి వద్ద రోజువారి విద్యుత్ కూలీలుగా పని చేస్తున్నారు. ఘటన స్థలాన్ని చెన్నూర్ ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, విద్యుత్ ఏఈ రామ్మూర్తి పరిశీలించారు. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...