పంచాయతీలకు మహర్దశ


Wed,June 12, 2019 12:31 AM

-ఏడాదికి రూ.8 లక్షల మంజూరుకు హామీ
-సీఎం ప్రకటనతో సర్పంచ్‌ల హర్షం
-నిధులతో మౌలిక వసతుల కల్పనకు అవకాశం
-జిల్లాలో 310 గ్రామ పంచాయతీలు
-రానున్న నిధులు రూ.24.80 కోట్లు
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు మంజూరు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అన్ని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అంతే సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా విడుదల చేయనుంది. దీంతో ప్రతి ఏడాది జిల్లాకు కోట్లలో నిధు లు విడుదల కానున్నాయి. ఈ నిధులతో గ్రామ పంచాతీల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు అవకాశం కలుగుతుంది. జిల్లాలో 310 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 200 వరకు మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 500 లోపు చిన్న జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు ప్రతి ఏడాది రూ.8లక్షల నిధులు మంజూరు చేయనున్నారు.

రానున్న నిధులు రూ.24.80 కోట్లు
ఏడాదికి రూ. 8 లక్షల చొప్పున అంటే జిల్లాకు రూ. 24.80 కోట్ల నిధులు అందనున్నాయి. దీంతో సర్పంచ్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యం గా ఎన్నో ఏండ్లుగా గ్రామ పంచాయతీలకు నిధులు లేక నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రభు త్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల రూపురేఖలు మారాయి. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా తండాలను పంచాయతీలుగా మార్చారు. దీంతో ఎన్నో ఏండ్లుగా కనీస వసతులు, రోడ్డు, రవాణా మార్గాలకు నోచుకోని గ్రామాలు అభివృద్ధి బాటన పట్టాయి. ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం రూ.8లక్షలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో గ్రామ పంచాయతీలకు మరిన్ని జవజీవాలు చేకూరనున్నాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి ఊహించని విధంగా జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...