కారుణ్యం రాకుండా ఏఐటీయూసీ కుట్ర


Wed,June 12, 2019 12:30 AM

-టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
శ్రీరాంపూర్ : సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య రూపంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారనీ, ఇది ఓర్వలేక జాతీయ సంఘాలు కారుణ్య నియామకాలు బొంద పెట్టాలని కుట్ర చేస్తున్నాయని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ ఆరోపించారు. మంగళవారం శ్రీరాంపూర్ ఆర్‌కే న్యూటెక్ గనిపై ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి అధ్యక్ష ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ కార్మికులకు కారుణ్య ఉద్యోగాలు రాకుండా కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణా సాధించుకున్న సింగరేణి కార్మికులకు న్యాయ నిపుణుల సలహాలతో కారుణ్య ఉద్యోగాలు కల్పిస్తుంటే జాతీయ సంఘాలు కల్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ బోర్డులో తక్కువ పర్సెంటేజీ మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారసత్వ ఉద్యోగాలను ఒక ద్రోహితో కోర్టు ద్వారా అడ్డుకున్న ఏఐటీయూసీ తిరిగి కారుణ్య తొలగించడానికి కుట్రలు చేస్తున్నదని, మభ్యపెట్టే మాటలు కార్మికులు నమ్మవద్దనీ కోరారు.

అర్హులందరికీ కారుణ్య ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. అనర్హులైన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే యాజమాన్యంపై, టీబీజీకేఎస్‌పై ఇష్టారాజ్యాంగా అసత్య మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందరికీ ఇస్తే కారుణ్య ఉద్యోగాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. జాతీయ కార్మిక సంఘాలు నీతిమాలిన మాటలు మానుకోవాలని హెచ్చరించారు. కార్మిక హక్కులు పోగొట్టిన ఏఐటీయూసీకి టీబీజీకేఎస్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. కార్మికుల వేతనాల్లో నుంచి మెడికల్ స్కీం సీపీఆర్‌ఎంస్‌తో రూ.40 వేల రూపాయల కోత విధించి కార్మికులకు అన్యాయం చేశారని ఆరోపించారు. అధికారులకు గ్రాట్యూటీ రూ.20 లక్షలు 2017 నుంచి, కార్మికులకు 2018 నుంచి అమలు చేయించి అన్యాయం చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించారని తెలిపారు. కార్మికులను మభ్యపెట్టే విధంగా ఆరోపనలు చేయడం మానుకోవాలన్నారు. అలాంటి కార్మిక సంఘాలను కార్మికులు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిదులు వీరభద్రయ్య, రీజియన్ కార్యదర్శి మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు కాశీరావు, కుమారస్వామి, పెట్టం లక్ష్మ రమేశ్, పిట్ కార్యదర్శి డీ నర్సయ్య, నాయకులు జగన్, సతీశ్, హనుమంతు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...