నేడు కేంద్ర అటవీ శాఖ అధికారి పర్యటన


Wed,June 12, 2019 12:29 AM

-శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణకు అనుమతులపై పరిశీలన
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఓసీపీని విస్తరణ అనుమతులకై అటవీ శాఖ ఉన్నతాధికారులు శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణకు సంబంధించిన పరిసరాలు, అటవీ ప్రాంతాన్ని ఈ నెల 12న ఉదయం 9 గంటలకు సందర్శించనున్నారు. ఇప్పటికే శ్రీరాంపూర్ ఓసీపీ 1లో ఉత్పత్తి పూర్తిగా తిసి, ఓసీపీ 2 విస్తరణ జరిగింది. ఓసీపీ విస్తరణలో భాగంగా మరింత స్థల సేకరణకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఉన్న రిజర్వ్‌డ్ ఫారెస్ట్ స్థలం 165 ఎకరాలు సేకరించడానికి కేంద్ర ప్రభుత్వానికి యాజమాన్యం ప్రతిపాదనలు పంపించింది. అటవీ శాఖకు భూమికి బదులు భూమిని చూపించడానికి కూడా స్థల సేకరణ చేపట్టింది. లేదా భూమి విలువ ఆధారంగా అటవీ శాఖకు నిధులు సమకూర్చి అటవీ పెంపుదలకు చర్యలు తీసుకోవడానికి యాజమాన్యం నిర్వహించింది. అందులో భాగంగా ముదిగుంట, నర్వా, సమీప ప్రాంతంలో స్థలాన్ని కూడా గుర్తించినట్లు తెలిసింది.

ఈ మేరకు మద్రాస్ రీజినల్ కార్యాలయంకు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ చీఫ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ ఎల్ చంద్రశేఖర్ (ఐఎఫ్‌ఎస్) ఉన్నతాధికారి శ్రీరాంపూర్ ఓసీపీ విస్థరణ పరిసరాల అటవీ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఆయన నివేదిక, అనుమతి మేరకు శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణ జరగనుంది. శ్రీరాంపూర్ ఓసీపీ చెన్నూర్ రోడ్డుకు 300 మీటర్ల దూరం, గోదావరిఖని ఇందారం ైఫ్లెఓవర్ బ్రిడ్జి హైవేకు 500 మీటర్ల దూరం దుబ్బపల్లె సమీపం వరకు విస్థరణ జరగనుంది. శ్రీరాంపూర్ ఓసీపీ ఈ అనుమతులతో మరో 20 సంవత్సరాల వరకు ఉత్పత్తి కొనసాగించనుందని అధికారులు తెలిపారు. అటవీ అధికారితో సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, భాస్కర్‌రావు, జీఎం స్టేట్ సుభానీ, జీఎం పీపీ ఎన్విరాన్‌మెంట్ జీఎం సత్తయ్యగౌడ్‌లు సందర్శించనున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...