ప్రమాద రహిత ఉత్పత్తికి కృషి చేయాలి


Wed,June 12, 2019 12:29 AM

-జీఎంలకు వీడియో కాన్ఫరెన్స్‌లో సింగరేణి డైరెక్టర్ల సూచన
-స్వచ్ఛతా పక్వాడాను విజయవంతంగా నిర్వహించాలి
శ్రీరాంపూర్ : సింగరేణిలో ప్రమాద రహిత ఉత్పత్తి ఉత్పాదకతకు కృషి చేయాలని అన్ని జీఎంలను సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) చంద్రశేఖర్, డైరెక్టర్ (పీపీ) బీ భాస్కర్‌రావు ఆదేశించారు. మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎంలతో డైరెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సంస్థకు జీరో ప్రమాదాల సంస్థగా గుర్తింపు తేవడానికి ప్రతి అధికారి, ఉద్యోగి, కార్మికుడు కృషి చేయాలని డైరెక్టర్లు ఆదేశించినట్లు జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. డైరెక్టర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్లు సూచించిన అంశాలు వివరించారు. ఏరియాల వారీగా ఉత్పత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్య సాధనకు కావాల్సిన సౌకర్యలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోజు వారీగా, నెలవారీగా నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ఎప్పటికప్పుడు అధికారులు వారి స్థాయిలో గనుల వారీగా సమీక్షలు నిర్వహించుకొని ముందుకు సాగాలాని సూచించినట్లు వివరించారు. ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ నెల 30న స్వచ్ఛతా పక్వాడ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనీ, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీవైజీఎం గోవిందరాజు, డీవైజీఎం (సివిల్) ప్రసాదరావు, ఐటీ జీఎం శ్రీనివాసరావు, పీఎం తుకారాం, పీఆర్‌ఏ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...