దరఖాస్తుల ఆహ్వానం


Wed,June 12, 2019 12:29 AM

మంచిర్యాల రూరల్ : జిల్లాలో షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతీ,యువకులకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాసులు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు హరినాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.అస్టిమల్ స్కిల్స్ అండ్ సొల్యూషన్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్వంలో హౌస్ కీపింగ్ అంశంపై 3 నెలల శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 5వ తరగతి లేదా ఆపై విద్యార్హతలు కలిగిన 18-35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులని వివరించారు. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1. 50 లక్షలకు మించి ఉండరాదని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, రేషన్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కేరళ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(కెల్ట్రాన్) సంయుక్త ఆధ్వర్వంలో హైదరాబాద్ బోడుప్పల్‌లోని డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో వర్క్‌పాసింగ్ అండ్ డాటా ఎంట్రీ, అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ ట్యాలీ, ఎంఎస్ ఆఫీస్ అండ్ బేసిక్ ఆఫీస్ ఆటోమేషన్ కోర్సులతో పాటు సాప్ట్ స్కిల్స్, ఇంగ్లిష్ స్కిల్స్, ఇంటర్యూ స్కిల్స్‌లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 12,13 తేదీల్లో జిల్లా కేంద్రం లోని కార్యాలయంలో దరఖాస్తుల చేసుకోవాలని వివరించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...