అవకతవకలకు పాల్పడితే చర్యలు


Wed,June 12, 2019 12:29 AM

-జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి
-ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక
వేమనపల్లి : ఉపాధిహామీ పనుల్లోఅవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఆర్డీఓ శేషాద్రి హెచ్చరించారు. వేమనపల్లి మండల అభివృద్ధి కార్యాలయం ఆవర ణలో ఉపాధి హామీ పనులపై మంగళవారం ప్రజావేదిక నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2018-19 సంవత్సరానికి రూ. 3.50 కోట్ల తో ఉపాధి హామీపనులు నిర్వహించగా మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో వారం పాటు ఉపాధి హామీ పనులపై డీఆర్పీలు సామాజిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.గొర్లపల్లి, చామనపల్లి పంచాయతీల్లో మస్టర్లలో తేడాలు, కొలతల్లో తప్పులు, నీల్వా యి, దస్నాపూర్‌లలో కొలతల్లో తేడాలను గుర్తించారు. అవకతవకలకు పాల్పడిన సిబ్బందికి దస్నాపూర్‌లో రూ. 1472 రికవరీ, కేతనపల్లిలో 1500 జరిమానా, రికవరీ రూ. 1211 రికవరీ , నీల్వాయిలో రూ. 3 వేల జరిమానా, రూ. 4974 రికవరీకి ఆదేశించినట్లు తెలిపారు. సుంపుటంలో రూ. 7500 జరిమానా, రూ. 1795 రికవరీ, గొర్లపల్లిలో రూ. 2 వేల జరిమానా, రూ. 10,025 రికవరీ, చామనపల్లిలో రూ. 14500 జరిమానా, రూ. 41634 రికవరీ, ముల్కలపేటలో రూ. 4500 జరిమానా, రూ. 2880 రికవరీ, సూరరంలో రూ. 1915 రికవరీ, జిల్లెడలో రూ. 2308 జరిమానా, 1935 రికవరీకి ఆదేశించినట్లు తెలిపారు. మొత్తం జరిమానా రూ. 35308, రికవరీకి రూ. 67841 విధించినట్లు తెలిపారు. పంచాయతీల వారీగా ఎస్‌ఆర్‌పీ రాములు నివేదికలను చదివి వినిపించారు. జిల్లా విజిలెన్స్ అధికారి సుధాకర్, లింగయ్య, ఎంపీపీ కుర్రు వెంకటేశం, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఏపీఓ సత్య ప్రసాద్ , సర్పంచులు, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...