అభివృద్ధి ఉద్యమం


Tue,June 11, 2019 12:58 AM

-పల్లెలు, పట్టణాల్లో జోరందుకోనున్న ప్రగతి పనులు
-జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్ల పనులకు మోక్షం
-వరుస ఎన్నికలతో నిలిచిన డెవలప్‌మెంట్
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీ, పరిషత్ ఎన్నికలు.. దాదాపు ఏడు నెలల కాలం.. కోడ్ అమలులో ఉన్న సమయం.. అభివృద్ధి పనులు నిలిచాయి.. ప్రస్తుతం పరిషత్ ఎన్నికలు, జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక కూడా పూర్తికావడంతో కోడ్ ముగిసింది. ఇప్పటివరకు నిలిచిన పాఠశాల, కళాశాల, రోడ్లు, బ్రిడ్జీలు భవనాల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు కొనసాగించి ప్రజల ఇబ్బందులు తొలగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నూతన పాలక వర్గాలు ఎన్నిక కావడంతో ప్రగతి పరుగులు పెట్టనుంది. అభివృద్ధి ఉద్యమంగా సాగనుంది.జిల్లా వ్యాప్తంగా రూ.100 కోట్ల పనులకు మోక్షం కలగనుంది.

వరుస ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉంది. నవంబర్‌లో ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటనతో అమలులోకి వచ్చింది. దాదాపు ఏడు నెలల కాలంగా అభివృద్ధి పనులు నిలిచాయి. గతేడాది డిసెంబర్ నుంచి ఒకదాని వెంట ఒకటి ఎన్నికలు ఉంటున్నాయి. మొదటగా డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనంతరం జనవరి 21, జనవరి 25, జనవరి 30న మూడు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలు.. మే 6, మే 10, మే 14న మూడు విడతలుగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో కోడ్ కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా మే 23న ఫలితాలు వచ్చేంత వరకు కోడ్ ఉంది. అయితే పరిషత్ ఎన్నికల ఫలితాలు మే 27న ఉండగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మరోవైపు మండల పరిషత్ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ల ఎన్నికల నిర్వహణ ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహించారు. దీంతో కోడ్ పొడిగిస్తూ వచ్చారు. ఇలా డిసెంబర్‌లో మొదలైన కోడ్ జూన్ 8వ తేదీతో ముగిసింది. ఇలా చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఎన్నికల కోడ్ సుదీర్ఘంగా ఉండటంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచాయి. ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఎన్నికలు అన్నీ ఒకేసారి పూర్తయితే మధ్యలో కోడ్‌తో ఇబ్బందులు ఏర్పడకూడదని భావించింది. ఎట్టకేలకు శనివారం కోడ్ తొలిగిపోవడంతో అభివృద్ధి పనులకు మోక్షం కలగనుంది. ప్రజాప్రతినిధులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిలిచిన అభివృద్ధి పనులు
ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండటం తో పాఠశాల, కళాశాల, రోడ్లు, బ్రిడ్జీలు తదితర భవనాల నిర్మాణ పనులు ఆగిపోయాయి. చాలా పనులు నిధులు విడుదల కాకపోవడంతో నత్తనడకన నడుస్తున్నాయి. ఈ ఎండాకాలంలో మంచినీటి సమస్యను కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేని దుస్థితి. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై దృష్టి సారించారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు అంద రూ కొత్త గా వచ్చారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు అందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఉత్సాహంతో ఉన్నారు. కోడ్ తొలగడంతో రైతులకు రైతుబంధు సాయం పంపిణీలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతులకు అందనుంది. అలాగే రైతులకు రుణమాఫీ, ఆసరా పింఛన్లకు సంబంధించి అన్ని ఇబ్బందులు తొలగినట్లే అని చెబుతున్నారు. మరుగుదొడ్ల బిల్లులు, రోడ్లు, భవనాలు, ఇతర పనులకు కూడా ఇప్పటివరకు ఉ న్న పెం డింగ్ బిల్లులకు మోక్షం కలగనుంది. దీనివల్ల ఆ యా పనుల్లో వేగం పుంజుకోనుంది. దీని కోసం ప్రజాప్రతినిధులుఅధికారులతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతోపాటుగా ప్రారంభోత్సవాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే గ్రామాలవారీగా చేపట్టాలన్సిన అభివృద్ధి పనులు, ఎన్నికల్లో భాగం గా ఇచ్చిన హామీల అమలును ఈ అభివృద్ధి పను ల్లో భాగం చేసేందుకు నేతలు సిద్ధం కావడంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. జిల్లా లో రూ.100 కోట్ల పనులకు మోక్షం కలగనుంది.

ప్రశాంతంగా పల్లె గ్రామాలు
వరుస ఎన్నికలతో పల్లెల్లో పెద్ద ఎత్తున హడావిడి సాగింది. నాలుగు ఎన్నికలు వరుసగా రావడంతో దాదాపు ఏడు నెలలుగా వచ్చిన ఎన్నికల సమరం లో గ్రామాల్లో సందడి నెలకొంది. సాధారణ ఓట ర్లు మొదలుకుని కార్యకర్తలు, నాయకులు తీరిక లేకుండా గడిపారు. ఇక అధికారుల విషయమైతే చెప్పలేని పరిస్థితి. ఎన్నికలకు తగ్గట్టుగా ఎండాకా లం తోడు కావడంతో గ్రామాల్లో పనులు కూడా అంతంత మాత్రమే. దీంతో ఎన్నికల పం డుగలో ప్రజలు మునిగి తేలారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇటీవల పరిషత్ కౌంటింగ్, పాలక వర్గాల ఎన్నికల వరకు గ్రామాల్లో పార్టీల వారీగా నిద్ర లేకుండా గడిపారు. ఎన్నికల గోల ముగియడంతో ఇక పల్లెలు అన్ని ప్రశాంతంగా మారాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జనం పొలాల వైపు మళ్లారు. ఇక ప్రజలు సాగుబాట పట్టారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...