రైతుబంధు ప్రతి రైతుకూ చేరాలి..


Tue,June 11, 2019 12:58 AM

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి
మంచిర్యాల రూరల్ : ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా అందించే పెట్టుబడి సహాయం ప్రతీ రైతు చేరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధర్‌సిన్హా, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పార్థసార థి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ్ది శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతు ప్రసాద్‌తో కలిసి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రైతు బంధు 2021 జనాభా లెక్కల సమీకరణ అంశాలపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లా డుతూ.. ఎన్నికల కోడ్ ముగిసినందున రైతుల వివరాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతు బంధు సహాయం అందించేందుకు సీసీఎల్‌ఏ నుంచి డిజిటల్ సంతకం చేసిన పట్టాదా రుల వివరాలు, పట్టాదారుల విస్తీర్ణంతో పాటు ఖరీఫ్-2019 రైతు బంధు సహాయానికి సీపీఎల్‌ఏ వద్ద ఉన్న 54.56 లక్షల పట్టాదారులకు సంబంధించి 1.40 లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలను సేకరిం చామని తెలిపారు.

ఈ-కుబేర్ ద్వారా పట్టాదారుల ఖాతాలకు నిధులు జమ చేస్తామని చెప్పారు. రైతుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ విష యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జూన్ 3వ తేదీ నుంచి బి ల్లులు సమర్పించి ఈ నెల 7వ తేదీ వరకు 7.19 లక్షల మంది రైతులకు రూ. 781 కోట్ల 17 లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఖరీఫ్-2019 రైతుబంధు సహాయా నికి జూన్ 10వ తేదీ నాటికి డిజిటల్ సంతకాలు చేసిన రైతులకు సహాయం అందిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వై సురేందర్ రావు, జిల్లా గ్రామీణాబివృద్ధి శాఖ అధికారి శేషాద్రితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...