అత్యాధునిక వసతులతో గ్రంథాలయం


Tue,June 11, 2019 12:57 AM

భవన నిర్మాణ పనుల పరిశీలించిన చైర్మన్ ప్రవీణ్
బెల్లంపల్లి టౌన్ : అత్యాధునిక వసతులతో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ అన్నారు. పాత క్లబ్ పాఠశాల ఆవరణలో చేపట్టిన గ్రంథాలయ నూతన భవన నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠకులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చదువుపై పూర్తిగా ఏకాగ్రత కల్పించే విధంగా పనులు జరుగుతున్నట్లు తెలిపారు. నూతన భవనం నిర్మాణం కోసం రూ. 75లక్షలు మంజూరయ్యాని పేర్కొన్నారు. ప్రత్యేక రీడింగ్ గదులు, ఇంటర్నెట్ సౌకర్యం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. తాత్కాలిక గదుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న పాఠకులకు గ్రంథాలయ భవన నిర్మాణంతో ఆ కష్టాలకు తెరపడిందన్నారు. భవన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి పాఠకులకు అందుబాటులోకి తెవాలని డీఈ శ్రీనివాస్, ఏఈ వినయ్‌ని ఆదేశించారు. ఆయనతో పాటు గ్రంథాలయాధికారి ఉప్పు గోపీ, ఆఫీస్ అసిస్టెంట్ ఇడిగిరాల శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు గజె ల్లి చంద్రశేఖర్, బడికెల రమేష్,కాంట్రాక్టర్ రవి, పాఠకులు, స్వీపర్ నీలి రమేష్‌లు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...