సమస్యలను త్వరగా పరిష్కరించాలి


Tue,June 11, 2019 12:57 AM

-ప్రత్యేకాధికారి ప్రకాశ్, తాసీల్దార్ కిరణ్మయి
-ప్రజావాణిలో అర్జీల స్వీకరణ
దండేపల్లి : సమస్యలను పెండింగ్‌లో పెట్టి బాధితులను కార్యాలయాల చుట్టు తిప్పించుకోవద్దని దండేపల్లి ప్రత్యేకాధికారి ప్రకాశ్, తాసీల్దార్ కిరణ్మయి సూచించారు. సోమవా రం దండేపల్లి మండల పరిషత్ కార్యాలయం లో నిర్వహించిన ప్రజావాణిలో వారు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఎంతో నమ్మకంతో పేద ప్రజలు సమస్యలు తీర్చాలని అర్జీలు ఇస్తుంటారనీ, వాటిని పెండింగ్‌లో ఉంచకుండా సమస్య తీర్చేందు కు ప్రయత్నించాలన్నారు. సమస్యలను గుర్తిం చి వాటిని నోట్ చేసుకొని పరిష్కరించాలే తప్ప, పెండింగ్‌లో ఉంచి బాధితులను ఇబ్బందులకు గురిచేయవద్దని వారు సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ సమస్యలపై 7 గురు, పెన్షన్ అందించాలని ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి అంజిత్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శిరీష, ఆర్‌ఐలు గణపతి, అన్నపూర్ణ, ఎక్సైజ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఓలు, తదితరులు ఉన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...