పదిసప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం


Tue,June 11, 2019 12:57 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 3957 మంది విద్యార్థులు పరీక్షలు రా యనుండగా, 21వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. మంచిర్యాలలోని గర్మిళ్ల ప్రభుత్వ పాఠశాల, చెన్నూర్‌లోని జడ్పీఎస్‌ఎస్ పాఠశాల, లక్షేట్టిపేటలోని జడ్పీ బాలికల పాఠశాల, బెల్లంపల్లి బ జార్‌ఏరియాలోని జడ్పీ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఈవో ఎంఏ రషీద్ తెలిపారు. ఉద యం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మొదటిరోజు సోమవారం 131 మంది విద్యార్థులకు 61 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 70 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఒక ైప్లెయింగ్‌స్కాడ్ బృందం పరీక్షల కేంద్రాలను తనిఖీ చేస్తుంది.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...