స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు


Tue,June 11, 2019 12:57 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : తెలంగాణ రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లోని స్పోర్ట్స్ స్కూల్‌లలో ప్రవేశం కోసం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటి ఆదేశాల ప్రకారం జిల్లాలో ఎంపిక పోటీలు నిర్వహిస్తునట్లు జిల్లా యువజన క్రీడాశాఖాధికారి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర షెడ్యూల్‌ను అనుసరించి మంచిర్యాల జిల్లాలో మండల స్థాయి ఎంపిక పోటీలను ఎంఈవోలు అయా మండలాల్లో జూన్ 15 వరకు నిర్వహించాలన్నారు. ఎంపికైన వారిని జూన్ 20,21 తేదీల్లో జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించే పోటీలకు పంపిచాలని డీఈవోలకు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి ప్రతిభ చూపిన వారిని జులై 15,16 తేదీల్లో హాకీంపేటలో జరుగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. 3వ తరగతి పూర్తి చేసి నాల్గవ తరగతిలో చేరే విద్యార్థులు 1-9-2010 నుంచి 31-8-2011 సంవత్సరం మధ్య జన్మించిన వారు అర్హులని డీవైఎస్‌వో తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వయస్సు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్ ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి, పుట్టిన తేదీ సర్టిఫికెట్ తాసీద్దార్ లేదా పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పోరేషన్ నుంచి జారీ చేసినది. పది పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఫోగ్రేస్ రిపోర్ట్, ఆధార్‌కార్డ్, కమ్యూనిటీ సర్టిఫికెట్ తప్పని సరిగా తీసుకురావాలన్నారు. ఎత్తు, బరువు, 30 మీటర్ల ైప్లెయింగ్ స్టార్ట్, స్టాడింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్, వర్టికల్ జంప్, 6X10 మీటర్ల షటిల్న్,్ర మెడిసిన్ బాల్ త్రో, ప్లెక్సిబిలిటీ టెస్ట్‌ల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుందనీ డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...