జాతీయ సంఘాల తీరుతో అన్యాయం


Tue,June 11, 2019 12:57 AM

-కోల్ ఇండియాలో ఒక తీరు సింగరేణిలో మరో తీరా..
-టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి
యైటింక్లయిన్ కాలనీ : సింగరేణిలో జాతీయ సంఘాల ధ్వంధ్వ విధానంతో కార్మికులు తీరని అన్యాయానికి గురవుతున్నారని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీ-2 ఏరియాలో వర్క్‌షాప్‌లో సోమవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగులో ఆయన మాట్లాడారు. జాతీయ సంఘాలు జేబీసీసీఐలో తప్పుడు ఒప్పందాలు చేసుకుని కార్మికులకు తీరని నష్టం చేకూర్చయన్నారు. కోల్ ఇండియాలో అమలు కానీ అనేక హక్కులు సింగరేణిలో అమలు జరుగుతున్నాయనీ.. కానీ, జాతీయ సంఘాలు కోల్ ఇండియాలో ఒక తీరు సింగరేణిలో మరో తీరుగా వ్యవహరిస్తూ కేవలం వారి పబ్బం కోసం తప్పుడు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. సింగరేణిలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో పనికో రేటు పెట్టి చందాల దందా చేసి కార్మికులను ఆర్థిక దోపిడీకి గురి చేసిన ఏఐటీయూసీ తమను విమర్శించడం చూస్తే దొంగే దొంగ అన్న చందగా ఉన్నదని ఎద్దేవా చేశారు. గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్ గెలిచిన తర్వాత కార్మికుల్లో ప్రశ్నించే తత్వాన్ని నెలకొల్పడంతోపాటు స్వేచ్ఛగా పని చేసే వాతావరణాన్ని కల్పించి పారదర్శకతతో మరోపేరు తీసుకవచ్చామన్నారు.

18 ఏండ్ల క్రితం వారసత్వ ఉద్యోగాన్ని పొగొట్టిన ఏఐటీయూసీ దాన్ని సాధించిన తమపై ఆరోపణలు చేయడం వారి నీతిమాలిన చర్య అన్నారు. లాభాల వాటా సాధించామని గొప్పలు చెప్పుకునే ఆ సంఘం ఒప్పందం నాటి నుంచి ఒక్క శాతం కూడా పెంచలేకపోయిందనీ, అదే తాము గెలిచిన నాటి నుంచి 27 శాతం ఇప్పించి కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించామన్నారు. 1740 వందల కోట్ల లాభాలు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తూ కార్మికులకు దగ్గరవ్వాలని చూస్తున్నదనీ, ఈ లాభాలపై యాజమాన్యం స్పష్టమైన ప్రకటన చేయకుండానే తప్పుడు ప్రచారం చేయడం ఏఐటీయూసీకి హితవు పలికారు. ఇంతకంటే గొప్పగా కోల్ ఇండియాలో అమలు చేసినట్లు చూపిస్తే తాము సైతం దాని అమలుకు కృషి చేస్తామన్నారు. కార్మికుల హక్కుల సాధనకు, వారి సంక్షేమంపై మంచి సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుని ఆ దిశగా పని చేస్తామని అంతే తప్పా, అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తూ, కార్మికులను తప్పు దోవ పట్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ గేట్ మీటింగులో డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, దేవ వెంకటేశం, చెరుకు ప్రభాకర్ రెడ్డి, ధరణి మల్లేశ్వర్‌రావు, పైడిపల్లి ప్రభాకర్, సురేందర్, కొంగర రవీందర్, భీమలి సత్యనారాయణ, బాలసాని కొమురయ్య, బుద్దార్థి బాబు, రాంశర్మ, వైకుంఠం, నర్సింహరెడ్డి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...