రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం


Tue,June 11, 2019 12:57 AM

-14 నుంచి బడిబాట కార్యక్రమం
మంచిర్యాల స్పోర్ట్స్: వేసవి సెలవులు మంగళవారంతో ముగియనున్నాయి. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీన ప్రారంభం కావాల్సిన బడులు ఈ ఎడాది ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సెలవులు జూన్ 11 వరకు పొడిగించారు. దీంతో బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఆరంభం అవుతాయి. విద్యార్థులు యూనిఫామ్స్, పుస్తకాలు, తదితర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. 2018-19 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ పాఠశాల విద్యకు నూతన క్యాలెండర్‌ను రూపొందించింది. జూన్ 1న పాఠశాలలు ప్రారంభించి ఏప్రిల్ 12 వ తేదీ వరకు విద్యా సంవత్సరం కొనసాగించారు. ఈ ఏడాది ఎండల తీవ్రతతో పాఠశాలలకు ఆదనంగా 12 రోజులు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల ప్రారంభం రోజునే యూనిఫామ్స్, బుక్స్ అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...