నక్కలపల్లి జాతర ప్రారంభం


Tue,June 11, 2019 12:56 AM

కోటపల్లి: మండలంలోని నక్కలపల్లి గ్రామంలో మారమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆల య ఆవరణలో పట్నాలు వేయడంతో పాటు జంతు బలులను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. నూతన ఎంపీపీ మంత్రి సురేఖ, చెన్నూర్ రూరల్ సీఐ జగదీశ్, ఎంపీటీసీ పుప్పిరెడ్డి మొండక్క, సర్పంచ్ తోట స్రవంతి, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ బద్రినాథ్ స్వామితో పాటు భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారి వెంకమ్మ, పం గిడి లక్ష్మి, మండల నాయకులు మంత్రి రామయ్య, పుప్పిరెడ్డి రాంరెడ్డి, శ్రావణ్, మాజీ సర్పంచ్, తోట అశోక్ తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...