ఐఎస్‌డీసీలో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ


Tue,June 11, 2019 12:56 AM

మందమర్రి: ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్ (ఐఎస్‌డీసీ)లో మందమర్రి పాత బస్టాండ్ ఏరియాకు చెందిన శ్రీచైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. పాఠశాలలో 7, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినులు ప్రణవి, అక్షయ రూపొందించిన హాజె ల్ అనే ప్రాజెక్టు నాసాకు ఎంపికైంది. దీనితో ప్రాజెక్టు వివరాలను ఐఎస్‌డీసీలో ప్రదర్శించి అక్క డి శాస్త్రవేత్తలకు వివరించేందుకు గత నెల 31న అమెరికాకు బయలు దేరి వెళ్లారు. ఆదివారం అవకాం రావడడంతో విద్యార్థులు ప్రాజెక్టు వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. చిన్న వయస్సులోనే భారీ ప్రయోగం చేసి ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులను శాస్త్రవేత్తలు అభింనందించారని పాఠశాల హెచ్ ఎం అయూబ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు అమెరికాలో జరిగిన ఐఎస్‌డీసీ సదస్సులో అంతర్జాతీయ సామార్ధ్యాలకు అనుగుణంగా రూపొందిన ప్రాజెక్టును నాసా శాస్త్రవేత్త జిమ్ బ్రిడెన్ స్టిన్‌కి వివరించి వారి మన్ననలు పొందడం ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. పాఠశాలల చైర్మన్ మల్లెపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం లక్ష్మణ్‌రావు, అకాడమిక్ కోఆర్డినేటర్ అమరాజ్‌లు అభినందించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...