మరుగుదొడ్లు నిర్మించుకోవాలి


Tue,June 11, 2019 12:56 AM

చెన్నూర్ రూరల్: ఇంటికో మరుగుదొడ్డి తప్పకుండా ఉండాలని పంచాయతీ కార్యదర్శి మల్లేశ్ సూచించారు. సుద్దాలలో సోమవారం పారిశుధ్య పనులు చేపట్టారు. డ్రైనేజీలో పూడికలు తీయించారు. మురుగుకాలువల వద్ద, నీరు నిల్వ ఉన్న చోట, మురికి గుంతల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అనతరం మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. రాబోవు రోజుల్లో మరుగుదొడ్లు లేని వారికి ప్రభుత్వ పథకాలు వర్తించవని చెప్పారు. ఆయన వెంట సర్పంచ్ పోలు అర్చన, నాయకులు రవిగౌడ్, టీఏ మల్లేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య, తదితరులు ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...