చండీ వందనం


Sun,May 26, 2019 03:40 AM

-అచ్చలాపూర్ యజ్ఞ వాటికలో వేదోక్తంగా సహస్ర చండీయాగం ప్రారంభం
-మొదటి రోజు అగ్ని మథనంతో హోమం నిర్వహించిన రుత్వికులు
-ఐదు రోజుల పాటు నిర్విరామంగా సాగనున్న పూజలు
తాండూర్: అచ్చలాపూర్‌లోని మహాదేవ వేద పాఠశాలలో రుద్ర సహిత సహస్త్ర చండీయాగం శనివారం ప్రారంభమైంది. పాఠశాల ప్రాంగణంలోని భారతీ తీర్థ స్వామి కల్యాణ మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాల, హోమ గుండాల్లో జ్యోతి వెలిగించి యా గాన్ని ప్రారంభించారు. వరంగల్‌కు చెందిన చెరకు జితేందర్‌రెడ్డి తన సొంత ఖర్చుతో నిర్వహిస్తున్న యాగాన్ని ఇక్కడి వేద పాఠశాల ప్రధా న అధ్యాపకులు దుద్దిళ్ల మనోహర్ ఆవధాని, వేద గురువు ముద్దు దీరజ్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రతువులో మొదటి రోజు శనివారం ఉదయం వేద స్వస్తి, అమ్మవారి పూజ, గోపూజ ప్రారంభమైంది. పంచగవ్య ప్రాశాణం, రుత్వి క్ వర్ని, మండప దేవతా స్థాపిత పూజలు, సప్తశతి పారాయణం, రుద్రాభిషేకం, సప్తశతి హో మం నిర్వహించారు. మండపంలో అమ్మవారి ని ప్రతిష్టించి అరణి నుంచి అగ్నిని మదించడం ద్వారా రగిలిన నిప్పుతో యాగ క్రతువును ప్రా రంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 150 మంది రుత్వికులతో పాటు తిరుపతి, విజయవాడ, గుంటూరుకు చెందిన నాలుగు వేదాల పండితులు యాగంలో పాల్గొంటున్నారు. యా గాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక భోజన వసతి ఏర్పా టు చేశారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...