సంక్షేమ పథకాలతోనే టీఆర్‌ఎస్ విజయం


Sun,May 26, 2019 03:39 AM

-ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు
-ఎమ్మెల్యే దివాకర్‌రావు
మంచిర్యాల టౌన్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే టీఆర్‌ఎస్ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకటేశ్‌నేతకు భారీ మెజార్టీ అందించిన ప్రజలకు పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాలలోని తన నివాసంలో శనివారం సాయంత్రం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చి, ఆయన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. సీఎంపై విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పారు. కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చాలా కష్టపడి పనిచేశారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, ఐసీడీఎస్ ఆర్గనైజర్ అత్తి సరోజ, రైతు సమన్వయ సమితి కన్వీనర్ గురువయ్య, టీబీజీకేఎస్ నాయకులు సురేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నాయకులు యాదగిరిరావు, పెండ్లి అంజయ్య, దొమ్మటి సత్తయ్య, కార్కూరి చంద్రమౌళి, చంద్రశేఖర్ హండే, దబ్బెట శ్రీనివాస్, పులిరాయమల్లు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...