ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరగాలి


Sun,May 26, 2019 03:39 AM

-జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
-ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
మంచిర్యాల రూరల్: రాష్ట్ర అవిర్భావ దినోత్స వ వేడుకల (జూన్ 2న)కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జేసీ సురేందర్ రావు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్, అసిస్టెంట్ ట్రెయినీ కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా లో వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ వస్తున్నారని తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులలర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ప తాకావిష్కరణ అనంతరం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సంక్షిప్త నివేదిక ప్రసంగిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పరేడ్, ప్రోత్సాహక ప్రశంసా పత్రాల పంపిణీ ఉండదని చెప్పారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శాఖల వారిగా కేటాయించిన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆ ధ్వర్యంలో రక్తదాన శిబిరం, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పండ్లు, బ్రెడ్ పంపిణీతో పాటు అమరుల కుటుంబాలకు సన్మానం ఏర్పా టు చేయాలని ఆదేశించారు. వేడుకలకు వచ్చే వారందరికీ తాగునీరు, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులతో పాటు సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...