తాండూర్ కేజీబీవీ ఫలితాల్లో ఆదర్శం


Sat,May 25, 2019 02:15 AM

-ప్రారంభమైన మొదటి సంవత్సరమే సత్తా చాటిన విద్యార్థినులు
-రాష్ట్రంలోనే మొదటి స్థానం కైవసం
-మరింత బాధ్యతగా పని చేస్తామంటున్న సిబ్బంది
బడి బయట ఉన్న, వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసి న బాలికల కోసం కస్తూర్బా విద్యాలయాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్రవేయడంతో బాలికా విద్యకు మరిం త భరోసా కల్పించినైట్లెంది. అన్ని సామాజిక వర్గాలకు సమానంగా విద్య అందాలనే లక్ష్యంతో సీఎం కేజీబీవీలు ఏర్పాటు చేశా రు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన మండలాల్లో బాలికా విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభు త్వం మరో అడుగు ముందుకేసింది. ఉన్నత చదువులు కొనసాగించేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడంతో పదో తరగతితోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. అలా చదువు మానేసిన బాలికలు ఉన్నత విద్యకు దూరం కావద్దనే కేజీబీవీల్లోనే 2018-19 విద్యా సంవత్సరంలో జూనియర్ మొదటి సంవత్సరం ప్రారంభించారు. అక్షరాస్యతలో వెనుకబడ్డ బాలికలకు ఉన్నత చదువులు అందించేందుప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి అమలుపరిచింది. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున కస్తూర్బా బాలికల జూనియర్ కళాశాలలు మంజూరు చేసింది.

జిల్లాలోని మంచిర్యాల, తాండూర్ కేజీబీవీ పాఠశాలల్లో ఇంటర్ తరగతులు మంజూరు కాగా, ఆగస్ట్ 2018 లో బెల్లంపల్లి ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య, ఎంపీపీ మాసాడి శ్రీదేవి తరగతులు ప్రారంభించారు. తాండూర్ కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ తరగతులకు అవసరమైన అన్ని మౌలి క వసతులు కల్పించారు. ఇంటర్ తరగతుల ప్రవేశం కోసం ప్రత్యేక అధికారి కవిత ముందుగానే వేసవి కాలంలో ప్రచారం నిర్వహించడంతో విద్యార్థుల ప్రవేశాలు కల్పించారు. ఇంటర్‌లో రెండు గ్రూపులు మంజూరవగా ఎంపీహెచ్‌డబ్ల్యూలో 46 మంది, సీఈసీలో 40 మంది చొప్పున రెండు సెక్షన్లలో 86 మంది నిండిపోయారు. అనుకున్న దానికంటే ఎక్కువ విద్యార్థులు వచ్చారని ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులను తీ సుకున్నామని ప్రత్యేకాధికారి పేర్కొన్నారు. కళాశాల ఏర్పా టు, విద్యార్థుల అడ్మిషన్ అన్ని బాగానే జరిగాయి. ప్రయివేటుకు ధీటుగా ఫలితాలు రావాలని నిశ్చయించుకొని ప్రణాళికను సిద్ధం చేసుకున్నా రు. ఒక్కో సందర్భంలో విద్యార్థులను చదువు విషయంలో ఒత్తిడికి గురి చేస్తున్నామా అని అనిపించినా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకుని ముందు కు సాగామని ప్రత్యేకాధికారి కవిత చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో మొదటి స్థానం
ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే తాండూర్ కేజీబీవీ మొదటి స్థా నంలో నిలవడంతో సీఆర్టీలు, విద్యార్థినుల శ్రమ ఫలించిం ది. ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో చన్కపురి చంద్రకళ 500 మార్కుల 490, సీఈసీలో రాస ప్రశాంతి 461 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిం ది. వీరితో పాటు ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో బోరుకుంట కళావతి 478, జంగంపల్లి మేఘమాల 476, కొమ్మ సాయిలత 471, మాదాసు స్రవంతి 467, సీఈసీలో కుం దేటి శ్రావణి 444 మార్కులు సాధించారు. ఈ కళాశాల ఎంపీహెచ్‌డబ్ల్యూలో 98 శాతం, సీఈసీలో 84 శాతం ఫలితాలు సాధించారు. కేజీబీవీలోనే కాకుండా ప్రయివేటు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల్లో కేల్లా చంద్రకళ 500కు 490 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచింది.

మార్మోగిన విజయకేతనం
కళాశాలలోని విద్యార్థులు రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు సాధించడంతో మండల పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. వి ద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్, అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిన చంద్రకళను సన్మానించి బంగారు పతకం అందజేశారు. కేజీబీవీల్లో మె రుగైన విద్య అందుతోందని చెప్పేందుకు తాండూర్ కేజీబీవీ నిదర్శనమన్నారు. కలెక్టర్ భారతి హోళికేరి, జేసీ సురేందర్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి రషీద్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, తాండూర్ ఎంపీపీ మాసాడి శ్రీదేవి, జడ్పీటీసీ మంగపతి సురేశ్ బాబు అభినందించారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...