మొక్కలను సంరక్షించాలి


Sat,May 25, 2019 02:13 AM

-డీపీఓ వీర బుచ్చయ్య
లక్షెట్టిపేట : నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను జాగ్రత్తగా కాపాడాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ఆదేశించారు. శుక్రవారం మండలంలోని అంకతిపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లోని నర్సరీలను మండల పరిషత్, ఈజీఎస్ అధికారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వచ్చే వర్షాకాలం నాటికి మొక్కలను హరితహారం కోసం నాటడానికి సిద్ధం చేయాలన్నారు. ఎండల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొక్కల పెంపక బెడ్స్‌ను ఖాళీగా ఉంచకుండా వాటిలో మరిన్ని పెంచాలన్నారు. పెంచిన మొక్కలను నిల్వ ఉంచే ప్రదేశాలను (మ్యాటింగ్) గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 18 గ్రామాల్లో 9 లక్షలకు పైగా మొక్కలను ఆయా గ్రామ నర్సరీల్లో పెంచుతున్నట్లు అధికారులు డీపీఓకు వివరించారు. మండల పరిషత్ హాలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పారిశుధ్యం, ఈజీఎస్ పనులు, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌కు గ్రామ పంచాయతీ కార్యాలయంలో కుర్చీ, టేబుల్ అందుబాటులో ఉంచి ప్రజలకు సేవలందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే భాస్కర్, ఈవోపీఆర్డీ అజ్మత్ అలీ, ఏపీవో వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శులు సుభాష్, హరి కిషన్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...