ప్రవీణ్‌కుమార్‌పై ఆరోపణలు మానుకోవాలి


Sat,May 25, 2019 02:12 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని తెలంగాణ గురుకుల పేరేంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర సంతోష్‌నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై అరోపణలు చేసిన కర్నే శ్రీశైలంపై తెలంగాణ గురుకులాల పేరేంట్స్ అసోసియేషన్ బాధ్యులు మండిపడ్డారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఫలితాలు బాగున్నాయని అన్ని రాష్ర్టాల ప్రభుత్వాల నుంచి ప్రతినిధులు సందర్శించి అభినందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా శ్రీశైలం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీపీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య, కోశాధికారి మర్రి సదానందం, ఉపాధ్యక్షుడు దుర్గం భాగ్యలక్ష్మి, ఉషా, కృపావేని, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...