పరిసరాల పరిశుభ్రత పాటించాలి


Sat,May 25, 2019 02:12 AM

సీసీసీ నస్పూర్ : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని నస్పూర్ మున్సిపల్ మేనేజర్ శ్రీపతి బాపు సూచించారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముబీన్ అహ్మద్ ఆదేశాల మేరకు శుక్రవారం నస్పూర్ మున్సిపాలిటి పరిధిలో సిబ్బంది విస్తృతంగా పారిశుధ్య పనులు చేపట్టారు. పలు వాడల్లోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గల సింగరేణి డ్రైన్ నుంచి వచ్చే మురుగునీరు కాలువల్లో పేరుకుపోవడంతో జేసీబీతో తొలగించారు. వీధి దీపాలు రిపేర్లు చేసి అమార్చారు. ఈ పనులను మేనేజర్ శ్రీపతి బాపు పరిశీలించారు. మేకల మండి వద్దకు వెళ్లి శుభ్రత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం సీజన్‌లో ఎక్కువగా రోగా లు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డీసీ ప్రదీప్‌కుమార్, బిల్ కలెక్టర్ లింగయ్య, కారోబార్ పెద్దపల్లి గోపి, సిబ్బంది పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...