అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి


Sat,May 25, 2019 02:12 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : మంచిర్యాల జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు అర్హత లేకున్నా స్టెప్ అప్ ఇంక్రిమెంట్ తీసుకున్నారని సమాచార హక్కు చట్టం ప్రకారం బయటకు వచ్చిందని దీనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి ప్రేమ్‌రావు కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఎంఏ రషీద్‌ను శుక్రవారం డీఈవో కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ సొమ్ము అక్రమంగా పొం దిన వారి వివరాలు డీఈవో కార్యాలయానికి వచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. కాజేసిన సొమ్మును రీకవరి చేయాలని ఆదేశాలున్నా ఎందుకు వెనుకంజ వేస్తున్నారో తెలియజేయాలనీ లేదంటే ఉన్నతాధికారులకు తెలియజేసి డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...